మణిరత్నం 'కడల్' ఆడియో తేదీ ఖరారు
సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. నవంబరులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 'కడలి'కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శక,నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు. మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది.
మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.
మరో ప్రక్క మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ నటించబోతోందని హిందీలో ఇటీవల ప్రచారం మొదలైంది. 1938లో డఫ్నే డు మారియర్ రాసిన రెబెకా నవల ఆధారంగా ఆ చిత్రం రూపొందబోతోందని కూడా వార్తలొచ్చాయి. ఓ పెద్ద బాలీవుడ్ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించనుందని ఆ రూమర్స్ లో రాసుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలింది. మణిరత్నం భార్య సుహాసిని ఈ విషయాన్ని మీడియా రీసెంట్ గా ద్వారా అభిమానులకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications












