మణిరత్నం కొత్త చిత్రం‘కడలి’ఫస్ట్ లుక్
మణిరత్నం, సమంత కాంబినేషన్ లో కడలి అనే చిత్రం ఎనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఇది మణిరత్నం అభిమానులందరికీ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తమిళ,తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. సమంత సరసన తమిళనటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ నటించనున్నాడు. కార్తీక్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది.
'కడలి' టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. ఈ విషయమై సమంత స్పందిస్తూ..''మణి సార్ డెరైక్షన్‌లో నటించాలనేది నా కల మాత్రమే కాదు. ఇండియాలోని ప్రతి ఆర్టిస్ట్ కల. ఆ శుభ ఘడియ నాకు ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. దీన్ని గాడ్ గిప్ట్ గా భావిస్తున్నాను. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినా కలగని ఆనందం మణి సార్ సినిమాలో చేస్తున్నందుకు కలిగింది''అంది. ఇక సఖి తర్వాత మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.


Click it and Unblock the Notifications











