మణిరత్నం రూటే సపరేటు.. ఆ హీరోను తొలగించను.. కోలివుడ్‌కు షాకిచ్చిన దర్శక దిగ్గజం

వృత్తిపట్ల అంకితభావం లేని శింబు లాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు అని మైఖేల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వివాదాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం దృష్టికి తీసుకోగా ఆయన మండలి సభ్యులకు షాకిచ్చారట.

By Rajababu

Recommended Video

కోలివుడ్‌కు షాకిచ్చిన దర్శక దిగ్గజం..!

తమిళ నటుడు శింబు, అంబనవన్ అసరథావన్ అదంగథవన్ చిత్ర నిర్మాత మైఖేల్ రాయప్పన్‌ వివాదం గత కొద్దిరోజులుగా జరుగుతూనే ఉంది. శింబు ప్రవర్తన కారణంగా తాను 18 కోట్లు నష్టపోయానని నిర్మాత మైఖేల్ ఆరోపించారు. వృత్తిపట్ల అంకితభావం లేని శింబు లాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు అని మైఖేల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తమిళ నిర్మాతల మండలి శింబుపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. అయితే వివాదాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం దృష్టికి తీసుకోగా ఆయన మండలి సభ్యులకు షాకిచ్చారట.

 శింబుపై నిర్మాతల ఫిర్యాదు

శింబుపై నిర్మాతల ఫిర్యాదు

అంబనవన్ అసరథావన్ అదంగథవన్ చిత్ర షూటింగ్ సమయంలో శింబు కారణంగా నానా కష్టాలు అనుభవించాం. ఆయన పక్కన నటించడానికి ఏ హీరోయిన్ ‌కూడా రాలేదు. కొందర్ని బతిమాలి ఒప్పించాం. అయినా వారి పట్ల శింబు అభ్యంతరకరంగా వ్యవహరించారనే విషయాన్ని మణిరత్నానికి సూచించారట.

నిర్మాతల మండలికి మణిరత్నం షాక్

నిర్మాతల మండలికి మణిరత్నం షాక్

అంతేకాకుండా శింబుపై కఠిన చర్యలు తీసుకోవడానికి అందరితో సంప్రదిస్తున్నాం. మీరు కూడా శింబు విషయంలో సహకరించాలి అని జానవేల్ రాజా చెప్పారట. మీరు రూపొందించే చిత్రం నుంచి శింబును తొలగించాలి అని సూచించారట. అయితే నిర్మాతల మండలి సూచనలకు మణిరత్నం సానుకూలంగా స్పందించలేదనేది తాజా సమాచారం.

 శింబుకు వార్నింగ్

శింబుకు వార్నింగ్

నిర్మాతల ఫిర్యాదు నేపథ్యంలో శింబుకు ఫోన్ చేసి మణిరత్నం చర్చించారట. అంతేకాకుండా షూటింగ్‌కు సమయానికి రావాలి. సినిమా పూర్తయ్యేంత వరకు ఎలాంటి షరతులు లేకుండా సహకరించాలి అని శింబుకు మణిరత్నం స్పష్టం చేశారట.

 మణిరత్నానికి శింబు క్లారిటీ

మణిరత్నానికి శింబు క్లారిటీ

తనను నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఆలస్యంగా రావడం, ఇతర డిమాండ్లు నావైపు నుంచి ఉండవు అని మణిరత్నానికి శింబు వివరణ ఇచ్చారనేది ఇన్‌సైడ్ టాక్. శింబు వివరణతో సంతృప్తి చెందిన మణిరత్నం.. శింబును సినిమా నుంచి తొలగించేది లేదు అని నిర్మాతల మండలికి స్పష్టం చేశారట.

రూమర్లలో వాస్తవం లేదు

రూమర్లలో వాస్తవం లేదు

మణిరత్నం రూపొందించబోయే చిత్రంలో తాను నటిస్తున్నాను. నన్ను మణిరత్నం తొలగించారని వస్తున్న రూమర్లలో వాస్తవం లేదు అని శింబు ఇటీవల ప్రకటన చేశాడు. శింబు, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 20న సెట్స్ పైకి వెళ్లనుంది.

మణిరత్నంతో అరవింద్ స్వామి

మణిరత్నంతో అరవింద్ స్వామి

మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్న చిత్రంలో ఫహద్ పాజిల్, అరవింద్ స్వామి, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నారు.

మళ్లీ ఏఆర్ రెహ్మన్‌తో

మళ్లీ ఏఆర్ రెహ్మన్‌తో

మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ జోడి ఎన్నో అద్భుతమైన పాటలకు వేదికగా నిలిచింది. తాజా చిత్రానికి కూడా ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించడం గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగులు ఇటీవల గోవాలో జరిగాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X