మణిరత్నంకు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
Recommended Video

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటుకు గురయ్యారు. హృదయ సంబంధిత సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన గుండెపోటుకు గురికావడం ఇది మూడోసారి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అధికారికంగా వెల్లడికాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొన్నది.

మణిరత్నానికి మూడోసారి
గతంలో కూడా మణిరత్నం ఓ సారి గుండెపోటుకు గురయ్యారు. 2004లో యువ, 2009లో రావణ్ చిత్రాలను రూపొందించే సమయంలో గుండెపోటు వచ్చింది. గుండెకు సర్జరీ అనంతరం ఆరోగ్యవంతులయ్యారు. మళ్లీ నవాబు చిత్ర షూటింగ్ సమయంలో రావడం గమనార్హం.

సినిమాలకు దూరంగా
మణిరత్నం తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ఇటీవల కాలంలో సినిమాలకు దూరమయ్యారు. చెలియా, ఒకే బంగారం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి.

నవాబు చిత్రానికి దర్వకత్వం
ప్రస్తుతం మణిరత్నం నవాబ్ ( తమిళంలో చెక్క చివంత వనం) అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి శివ అనంత్‌తో కలిసి కథను అందిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ నటీనటులతో
చెక్క చివంత వనం చిత్రాన్ని భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి, శింబు, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితి రావు హైదరీ కీలకపాత్రల్లో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











