మణిరత్నం మరీ సీక్రెట్ గా...

By Srikanya

చెన్నై: చిత్రం ఫస్ట్‌లుక్‌లోనైనా హీరో ముఖాన్ని చూద్దామని ఆశపడిన ప్రేక్షకులకు మణిరత్నం గోప్యతతో నిరాశ తప్పలేదు. చరిత్రలో నిలిచిపోయే పలు చిత్రాలను అందించిన ఘనత మణిరత్నంకు దక్కుతుంది. ఆయన ప్రస్తుతం తమిళ హీరో కార్తీక్‌ నట వారసుడు గౌతమ్‌కార్తీక్‌ హీరోగా 'కడల్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నటి రాధ చిన్న కుమార్తె తులసి హీరోయిన్‌గా పరిచయం కానుంది.

ఇదిలా ఉంటే ఇందులో హీరో, హీరోయిన్ల ఆహార్యం ఇప్పటివరకు బయటకు రానివ్వలేదు మణిరత్నం. సినిమా చివరి దశకు కూడా చేరుకున్నప్పటికీ అదే గోప్యత పాటిస్తున్నాడు. చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ విడుదలను తెలుసుకున్న ప్రేక్షకులు 'హమ్మయ్యా.. నాయకానాయికల ఆహార్యమైనా చూడొచ్చు'అని సంబరపడ్డారు. అయితే విడుదల వరకు ఆ అవకాశాన్ని ఇవ్వదల్చుకోలేదో ఏమో.. ఫస్ట్‌లుక్‌లోనూ తనదైన శైలినే పాటించారు మణిరత్నం.

రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కేవలం గౌతమ్‌కార్తీక్‌ను మాత్రం అదీ వెనుక నుంచి చూపించి ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ పెంచాడు. గౌతమ్‌కార్తీక్‌ గెటప్‌ మాత్రం మాస్‌ హీరోను తలపిస్తుండటంతో ప్రేక్షకులకు ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. ఈ చిత్రంలో అర్జున్‌, అరవింద్‌ స్వామి, మంచు లక్ష్మీప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'కడలి' పేరుతో అనువదిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. నవంబరులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 'కడలి'కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శక,నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు.

మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది. ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X