Ponniyin selvan: మణిరత్నం హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ.. ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఎప్పుడంటే..

ఇండియన్ ఆల్ టైమ్ బెస్ట్ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం మొదటిసారి ఒక విజువల్స్ హిస్టారికల్ మూవీతో రాబోతున్నాడు. సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఆ భారీ విజువల్‌ వండర్‌ 'పొన్నియన్‌ సెల్వన్‌' రెండు బాగాలుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక మొదటి భాగం విడుదల తేదీపై సరికొత్త పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశారు.

2.0 సినిమా అనంతరం లైకా ప్రొడక్షన్స్‌ నుంచి వస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌ కూడా సినిమా నిర్మాణంలో భాగం అయిన విషయం తెలిసిందే. 'పొన్నియన్‌ సెల్వన్‌' ప్రాజెక్టును సుప్రసిద్ధ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ ను గత ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వలన ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. ఇక ఇప్పుడు తొలి భాగాన్ని 2022లో విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థలు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాయి.

Mani ratnam upcoming movie Ponniyin selvan part 1 release update

సినిమాలో విక్రమ్, అమితాబ్ బచ్చన్, కార్తీ , ఐశ్వర్యారాయ్, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ వంటి స్టార్స్ నటిస్తున్నట్లు అనేక రకాల కథనాలు వచ్చినప్పటికీ ఇంకా అధికారికంగా నటీనటులపై క్లారిటీ ఇవ్వలేదు. రెండు బాగాలుగా రాబోతున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. భారీ విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథనం: జైమోహన్‌, సంగీతం : ఏ ఆర్ రెహమాన్ , ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌, కళా దర్శకత్వం: తోట తరణి, కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌, నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌, సమర్పణ: సుభాస్కరన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X