కన్నుగీటి కుర్రకారు గుండెల్లో కుంపట్లు.. ప్రియా వారియర్ సంచలనం.. వైరల్‌గా మారిన పాట
Recommended Video

వాలంటైన్ డేకి కొద్ది రోజుల ముందు ఓ మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాను కుమ్మేసింది. ఒక్కసారి సుతారంగా కన్నుగొట్టిన ప్రియా యువత గుండెల్లో కుంపట్లు రాజేసింది. మలయాళ చిత్రం ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ అనే పాట ఇప్పడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. సెన్సేషనల్‌గా మారిన ప్రియ వారియర్ గురించి..

ఇంటర్నెట్‌లో దుమారం
మాణిక్య మలరాయ పూవీ పాట ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దుమారం సృష్టిస్తున్నది. ఆ పాటను షాన్ రెహ్మాన్ కంపోజ్ చేయగా, వినీత్ శ్రీనివాసన్ పాడారు. స్కూల్ నేపథ్యంగా సాగే ప్రేమ కథగా ఈ చిత్రం రూపుదిద్దుకొన్నది.

ఓవర్‌నైట్‌లోనే ప్రియా వారియర్
ఓరు ఆధార్ లవ్ చిత్రం ద్వారా ప్రియా ప్రకాశ్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. 18 ఏళ్ల ప్రియా త్రిచూరులోని విమలా కాలేజ్‌లో బీకాం చదువుతున్నది.

కన్నుగీటి.. కలవరం
కాలేజ్ డేస్ నుంచి ప్రియా వారియర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నది. మాణిక్య మలరాయ పూవీ పాటలో అమాయకంగా కన్నుగీటిన ఈ ముద్దుగుమ్మ ఓవర్‌నైట్‌లోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌గా మారింది.

స్కూల్ పిల్లల రొమాంటిక్ కథ
స్కూల్ పిల్లలపై ఈ పాటను చిత్రీకరించారు. పాఠశాల విద్యార్థుల మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సైగలు ఆహ్లాదకరంగా వీడియోలో ఉండటంతో ప్రతీ ఒక్కరు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు.

మోహినీఅట్టం నృత్యకారిణిగా
మోహినీఅట్టం నృత్యకారిణిగా ప్రియా వారియర్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. ఆమె ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఆమె ఫొటోలకు బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది.

వీడియోపై కుర్రకారు ఫిదా
మోడలింగ్, యాక్టింగ్ సంబంధించిన ప్రియా స్టిల్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రియా పలు ఫ్యాషన్ షోలలో ర్యాంప్ చేసిన షో ఇప్పటికే ఎంతో మందిని ఆకట్టుకొన్నది.

కొలవెరి డీ పాటను మించి
అప్పట్లో ధనుష్ కొలవెరి డీ పాట ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత మోహన్‌లాల్ నటించిన వెలిపడింటే పుస్తకం చిత్రంలోని జిమ్మి కమాల్ పాట సంగీత ప్రియులకు పిచ్చెక్కించాయి.

జిమ్మి కమాల్ పాట తర్వాత
కొలవెరి డీ, జిమ్మి కమాల్ పాట తర్వాత ఇప్పుడు మలయాళంలో మాణిక్య మలరాయ పూర్వి పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

5 మిలియన్ల వ్యూస్‌కు..
మాణిక్య మలరాయ పూవీ పాట రెండు రోజుల్లోనే సుమారు 5 మిలియన్ల వ్యూస్‌కు చేరువైంది. ఈ వీడియో 4,735,947 వ్యూస్‌ను సాధించింది. 1.50 లైక్స్, 10 వేలకు పైగా కామెంట్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిస్తున్నది.

ప్రియా వారియర్ పేరిట ఫ్యాన్ పేజీలు
ఒకే ఒక వీడియోతో ప్రియా వారియర్ ఏ స్టార్‌కు దక్కని క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఫ్యాన్ పేజ్‌ను క్రియేట్ చేయడం జరుగుతున్నది.
షూటింగ్ దశలోనే ఓరు ఆధార్ లవ్
ఓరు ఆధార్ లవ్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. హ్యాపీ వెడ్డింగ్, చంక్జ్ చిత్రాలను రూపొందించిన ఓమర్ లులూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











