అలాంటి వారినే ఎంచుకుంటాను.. ఎందులో ఉత్తమమో అదే చేయాలి.. మణిరత్నం కామెంట్స్
మణిరత్నం గురించి, ఆయన తెరకెక్కించే సినిమాల గురించి భారతీయ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజా చిత్రంతో మొదలైన మణిరత్నం ప్రయాణం.. నేటికీ కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటుంది. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌కు సాధారణ జనాలే కాదు సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతుంటారు. ఎక్కడా పెద్దగా మాట్లాడని మణిరత్నం తాజాగా లైవ్‌లోకి వచ్చారు. భార్య సుహాసినితో కలిసి లైవ్‌లోకి వచ్చిన మణిరత్నం అనేక విషయాలను వెల్లడించారు. అవేంటో ఓ సారి చూద్దాం.

మాధవన్ మార్చేశాడు..
సుహాసిని మాట్లాడుతూ.. హీరో మాధవన్ తన భర్తను పూర్తిగా మార్చేశాడని ఫిర్యాదు చేసింది. సఖి సమయంలో గోల్ఫ్ ఆడటం నేర్పించి మొత్తం మార్చేశాడని చెప్పుకొచ్చింది. మణిరత్నం మాట్లాడుతూ.. సఖిలో ట్రెయిన్ సీన్ తెరకెక్కించడనాకి కంగారు పడ్డాడని, అక్కడ కేవలం రెండు ట్రెయిన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

దయచేసి బాగా నటించండి..
అనంతరం పూనమ్ థిల్లాన్ సంధించిన ప్రశ్నకు మణిరత్నం ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. మీరు ఉత్తమమైన వారినే తీసుకుంటారా? లేదా సాధారణమైన నటులను తీసుకుని మీ సినిమాల ద్వారా ఉత్తములుగా చేస్తారా? అని ప్రశ్నిస్తే.. దయచేసి బాగా నటించండని తన నటులను అడుగుతుంటానని చెప్పుకొచ్చారు.
Recommended Video

అలాంటి వారినే ఎంచుకుంటా..
ఎలాంటి నటీనటులను ఎంపిక చేసుకుంటారనే ప్రశ్నకుగానూ.. నన్ను ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పెట్టరని అనిపిస్తారో వారినే ఎంచుకుంటా.. అంతేకాకుండా వారు పాత్రకు సరిపోతారని కూడా అనిపించాలని తెలిపారు.

ఆ డైరెక్టర్ అంటే ఇష్టం..
మణిరత్నమే అందరికీ ఫేవరేట్ డైరెక్టర్ అలాంటి దర్శకుడి ఇష్టమైన డైరెక్టర్ ఒకరు ఉన్నారట. అంగామలై డైరీస్, జల్లికట్టు చిత్రాలను తెరకెక్కించిన లిజో జోస్ తనకు ఇష్టమైన డైరెక్టర్ అని పేర్కొన్నారు.

ఎందులో ఉత్తమమో అదే చేయాలి..
వెబ్ సిరీస్‌లు చేయండని నెటిజన్ కోరాగా.. మనం ఎందులో ఉత్తమమే అదే చేయాలని ఓ ఉదహరణ కూడా చెప్పారు. తాను గత ఇరవై యేళ్లుగా టెన్నిస్ ఆడుతున్నానని,ఇప్పుడు మీరు ఫుట్ బాల్ ఆడమని అడుగుతున్నారు. ఆడినా గెలవలేను.. అంటూ వెబ్ సిరీస్‌ల జోలికి వెళ్లనని పరోక్షంగా చెప్పారు.


Click it and Unblock the Notifications











