Ponniyin Selvan 1: మరో వివాదంలో చిక్కుకున్న మణిరత్నం.. స్టార్ హీరోకు కూడా నోటీసులు

ఒకప్పుడు రోజా, బొంబాయి ఇలా ఎన్నో రకాల చోత్రాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకున్న మంచి దర్శకుడు మణిరత్నం మొదట అసలైన ఫ్యాన్ ఇండియా సినిమాలను పరిచయం చేశాడు అని చెప్పవచ్చు. అయితే ఆయన గత కొన్ని నెలలుగా ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా చారిత్రాత్మక నేపథ్యంలో తరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 1 అనే సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని ఫిక్స్ అయ్యారు.

ఇక టీజర్ ను ఇటీవల విడుదల చేయగా అప్పుడే వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల దర్శకుడికి హీరోకు నోటీసులు కూడా అందినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. క్లాసిక్ దర్శకుడు మునిరత్నం ఎలాంటి సినిమా తీసిన కూడా అందులో తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైన మార్క్ ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు మొదటిసారి ఆయన విభిన్నమైన తరహాలో చోళ రాజ్యాలకు సంబంధించిన కథను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో కొంతమంది అగ్ర నటి నటులు కూడా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Maniratnam dream project Ponniyin Selvan 1 new controversy news update

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ క్రమంలో సినిమా యూనిట్ కు ఒక చేదు అనుభవం ఎదురైంది. హీరో విక్రమ్ ఆదిత్య కరికాలన్ అనే పాత్రలో నటిస్తుండగా మొదట అతని పోస్టర్ లో బొట్టుతో చూపించగా ఆ తర్వాత టీజర్ లో మాత్రం కాస్త నెగిటివ్ గానే బొట్టు లేకుండా చూపించినట్లుగా ఒక లాయర్ కోర్టును ఆశ్రయించాడు.

చెన్నైలో డైరెక్టర్ మణిరత్నంకు అలాగే హీరో విక్రమ్ కి కూడా నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించే విధంగా తెరపైకి తీసుకువస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు అని సినిమా విడుదల కు ముందు ప్రత్యేకంగా ఒకసారి చూపించాలని కూడా నోటీసులు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో దర్శకుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X