టాప్ సింగర్ హీరోగా.. మణిరత్నం మరో క్రేజీ మల్టీస్టారర్!

కోలీవుడ్ నుండి సూపర్ క్రేజీ కాంబినేషన్స్ లో మూవీస్ రానున్న విషయం తెలిసిందే. అందులో మరో క్రేజీ కాంబో చేరినట్లు తెలుస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో సినిమా రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మణిరత్నం మరో సూపర్ కాంబినేషన్ సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

మణిరత్నం శింబు తో కలిసి ఈ సినిమా తెరకెక్కిస్తారని సమాచారం. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ గా రాబోతుంది. ఈ మూవీలో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ లేదంటే గాయకుడు సిద్ శ్రీరామ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Maniratnam multi starrer movie after kamal haasan project

ఎన్నో పాటలతో అలరిస్తూ చాలా మందికి ఫేవరెట్ గా మారిన గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమానే సిద్ శ్రీరామ్ కు డెబ్యూ కానుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

ఈ మల్టీస్టారర్ మూవీలో ముగ్గురు హీరోలు కాకుండా ఇద్దరితోనే తెరకెక్కించనున్నారు. శింబు ఎలాగూ ఉంటారు. ధ్రువ్ విక్రమ్ లేదంటే సిద్ శ్రీరామ్ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోనున్నారు.

మణిరత్నం ఆ మధ్య కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్- మణి కాంబోలో ఈ సినిమా రానుంది. ప్రస్తుతానికి KH234 అని తాత్కాలిక టైటిల్ పెట్టారు. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234వ చిత్రం రూపొందనుంది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీత అందించనున్నారు. కమల్ - మణి కలయికలో 1987లో నాయగన్ మూవీ వచ్చింది. నాయగన్ మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X