మణిరత్నంతో ఒకటికి మూడు: విక్రమ్
మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమాలో నటించినా చాలని చాలా మంది నటీనటులు ఆరాటపడుతూ ఉంటారు. అయితే ప్రముఖ నటుడు విక్రమ్ కి ఒక్క సినిమాతోనే మూడు సినిమాల ఆనందం కలుగుతుంది. అదేనండి రావణ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ బాషల్లో తీస్తున్నారు మణిరత్నం. ఈ మూడు చిత్రాల్లోను నటిస్తున్న విక్రమ్ ఒక్కోభాషలో ఒక్కోపాత్రలో కనిపించనున్నారు. తమిళంలో హీరోగా, హిందీలో విలన్ గా నటిస్తుండగా తెలుగులో నటిస్తున్న పాత్ర ఇంకా తెలియవలసి ఉంది.
మణిరత్నం దర్శకత్వంలో తమిళం రూపొందుతున్న ఈ చిత్రం కొద్దిగా రామాయణం పోలి ఉంటుందని సమాచారం అయితే ఇందులో ఐశ్వర్య రాయ్ సీత గాను, విక్రమ్ రాముడు గాను, పృధ్వీరాజ్ రావణాసురుడు గాను ప్రియమణి సూర్పనక, ప్రభు-విభూషణ గాను కార్తీక్ - హనుమాన్ గా నటిస్తున్నారని సమాచారం. మరి యొక విషేశం ఏటంటే మణిరత్నం గారి వైఫ్ ఒకప్పటి గ్రేట్ హీరోయిన్ క్యూట్ సుహాసిని కూడా నటిస్తున్నదని వినికిడి అయితే ఆమె పాత్ర ఏమిటనది సప్పెన్స్.


Click it and Unblock the Notifications











