డైరెక్టర్ కే నచ్చలేదు!!
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, విక్రమ్ ప్రధాన పాత్రలు గా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రావణ్ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలేసిందే. అయితే ఇప్పుడాయన నిర్మాతలకు కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు. షూట్ చేసిన భాగాల్లో కొన్ని బాగా రాలేదని మళ్ళి షూట్ చేయాల్సిందేనని పట్టు పడుతున్నారు. దాంతో నిర్మాతలు తెల్లబోతున్నారు. తమ చిత్రం లో అంతా పెద్ద స్టార్స్ ఉన్నారని వారి డేట్ లు పట్టుకు రావటం అంటే మాటలు కాదని అంటున్నారు. కాని మణి సర్ మాత్రం కాంప్రమైస్ అయ్యేటట్లు లేరు. ఇదంతా మణిరత్నంకి గుండెపోటుకు ముందు జరిగిన షూట్ భాగం. అప్పట్లో గుండెపోటుతో బాధపడుతూ కొద్ది రోజులు షూటింగ్ ఆపేశారు. కోలుకొని వచ్చిన ఆయన...తాను సినిమా రషెస్ చూసుకొని పెదవి విరిచి 'అబ్బే...కొన్ని చోట్ల బాగోలేదు. మళ్లీ షూటింగ్ చేద్దాం' అనడంతో ఆయన సహాయకులు ఖంగుతిన్నారు. ఐష్, అభి, విక్రమ్ ల తేదీలు మళ్లీ తీసుకోండి. దాదాపు 30 రోజులు అవసరమవుతాయన్నారట! ఆ స్టార్స్ కూడా ఏం మాట్లాడలేక, మణిరత్నానికి ఎదురు చెప్పలేక సతమవుతున్నారని టాక్.


Click it and Unblock the Notifications











