యమా క్రేజ్ గా మణిరత్నం-సుహాసిని ర్యాంప్ వాక్!
మణిరత్నం, సుహాసిని ఈ దంపతులు కలిసి కనిపించటమే చాలా తక్కువ కాగా ఈ ఇద్దరూ కలిసి ఓ షోలో ర్యాంప్ మీద వాక్ చేస్తే యమా క్రేజ్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ డిజైనర్ సంజనా సాషే ఆడపిల్లలను కాపాడాలి అనే ప్రచారంతో కొన్ని షోలు చేస్తోంది. ఈ షోలు ఇప్పటికే ఢిల్లీలో జరిగాయి. ముంబై, చెన్నైల్లో కూడా ఈ షోలు చేసి ప్రజల్లో ఆడ శిశువులను చంపకూడదు అనే మెసేజ్ ని తెలియజేయటానికి సంజనా పాటు పడుతోంది. ఇది చాలా మంచి ప్రయత్నం కాబట్టి డైరెక్టర్ మణిరత్నం, నటి సుహాసినిలు ఈ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. డిసెంబర్ లో ఈ షో చెన్నై లో జరపటానికి సంజనా ప్లాన్ చేస్తోందని వినికిడి.
ఈసందర్బంగా సంజనా మాట్లాడుతూ మణిరత్నం అతని భార్య సుహాసిని నా ప్యాషన్ షోలో ఒక భాగమన్నారు. వీరు మా షోకి మంచి ఆకర్షన అని ప్రసంశించారు. నేను చేసిన చివరి షో 'సేవ్ ద గర్ల్ చైల్డ్" ఢిల్లీ లో జరిగింది. ఇప్పుడు చెన్నైలో ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇంకా మరి కొందరు బాలివుడ్ స్టార్ కూడా ఇందు లో పాల్గొంటారాని చెప్పారు. ఈ షోలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా పాల్గొంటున్నారని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











