మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ రజనీ, మినీ స్టార్ ధనుష్!

By Sindhu

తెలుగులో చిరంజీవి, విజయశాంతి, వాణీశ్రీ నటించిన 'అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు" చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌ తో 'మాపిళ్లై" పేరుతో రీమేక్‌ చేయగా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. రజనీకి అత్తగా శ్రీవిద్య, భార్యగా అమల నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో రజనీ అల్లుడు ధనుష్‌తో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో అత్తగారి పాత్రకు తొలుత జయప్రదను, తర్వాత శ్రీదేవిని తీసుకుందామనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ ఆ సినిమా చేసేందుకు కుదరకపోవడంతో..సిమ్రాన్‌ తీసుకున్నారనే వార్తలు సైతం వచ్చాయి. అయితే..ఆ పాత్రను చివరికి నేపాలీ బ్యూటి గతంలో 'రజనీకాంత్" సరసన 'బాబా" చిత్రంలో చేసిన మనీషా కొయిరాలాను వరించిందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో ధనుష్‌ సరసన హన్సిక నటిస్తుంది. త్వరలోనే సెట్స్ పైకి సిద్దమవుతున్న ఈ చిత్రంలో థనుష్ ఓ వైరైటీ లుక్ తో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ రజనీ నటించి రెండు సార్లు విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ధనుష్ కి విజయవంతం అవుతుందంటారా!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X