దిలీప్ మాజీ భార్యతో ధనుష్ రొమాన్స్.. 40 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా!

Recommended Video

Dhanush Tweets About Manju Warrior Character In His Next Movie | Filmibeat Telugu

సినిమా విషయంలో కొన్నిసార్లు అరుదైన కాంబినేషన్స్ చోటు చేసుకుంటుంటాయి. అలాంటి కాంబినేషన్ క్రేజీ హీరో ధనుష్ నటించబోతున్న అసురన్ చిత్రం విషయంలో చోటు చేసుకోబోతోంది. ధనుష్ చేసిన తాజా ప్రకటన అసురన్ చిత్రంపై అంచనాలు మరింతగా పెంచేలా ఉంది. దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన వాడ చెన్నై చిత్రం మంచి విజయం సాధించింది. ఇదే కాంబోలో మరో చిత్రానికి గత నెలలో ప్రకటన జరిగింది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయం ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేపుతోంది.

ఊహాగానాలు నిజమే

గత కొన్ని రోజులుగా సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ గురించి అనేక వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలన్నీ ఇప్పుడు నిజమయ్యాయి. హీరో ధనుష్ తో మంజు వారియర్ రొమాన్స్ చేయబోతోంది. ఈ విషయాన్ని ధనుష్ అధికారికంగా ప్రకటించాడు. ఎవర్గ్రీన్ మంజు వారియర్ అసురన్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా అని ధనుష్ ట్వీట్ చేశాడు.

వయసులో పెద్ద

వయసులో పెద్ద

మలయాళీ వివాదాస్పద హీరో దిలీప్ మాజీ భార్యే మంజు వారియర్. మంజు వారియర్ 2015లో తన భర్త నుంచి విడిపోయింది. 90వ దశకం నుంచి హీరోయిన్ గా రాణిస్తున్న మంజు వారియర్ .. వివాహం తర్వాత కూడా నటన కొనసాగిస్తోంది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో కూడా మంజు వారియర్ ధనుష్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. మంజు వారియర్ ధనుష్ కన్నా వయసులో ఐదేళ్లు పెద్ద.

 తమిళంలో తొలిసారి

తమిళంలో తొలిసారి

మంజు వారియర్ పుట్టి పెరిగింది తమిళనాడులో. మలయాళీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందుకోవడంతో కేరళలో స్థిరపడి దిలీప్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. 2015లో విభేదాల కారణంగా దిలీప్ నుంచి విడిపోయింది. మంజు వారియర్ సినీ కెరీర్ ప్రారంభించిన 24 ఏళ్ల తర్వాత తమిళ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతుండడం విశేషం. మంజు వారియర్ హీరోయిన్ అని ప్రకటించడాన్ని ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి.

జనవరి 26న

జనవరి 26న

వెట్రిమారన్ దర్శత్వంలో తెరకెక్కబోయే అసురన్ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రారంభించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ ఈ చిత్రానికి బాణీలు అందించనున్నాడు. అసురన్ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వాడ చెన్నై చిత్ర సీక్వెల్ కు కూడా ధనుష్, వెట్రిమారన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X