హీరో ముఖ్యం కాదు హిట్టే ముఖ్యం: త్రిష
అగ్రశ్రేణి కథానాయుడితో జత కడితేనే గుర్తింపు బాగా వస్తుందనేది కథానాయికల్లో నాటుకుపోయిన అభిప్రాయం. అందుకే పెద్ద హీరోలతో సినిమా అనగానే పారితోషికం కూడా పట్టించుకోరు. అయితే కొందరు ఇందుకు భిన్నంగానూ ఆలోచిస్తుంటారు. త్రిష కూడా కథానాయకుడు ఎవరు? అనే విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వదట. 'సినిమా ఏదైనా కథానాయికల పరిధి తక్కువగానే ఉంటుంది. పాటలకూ, గ్లామర్ సన్నివేశాలకే పరిమితమైపోతాం. అలాంటప్పుడు ఎవరైనా ఒకటే కాదా..అంటోంది మన త్రిష..ఇవన్నీ ఎందుకు చెబుతోందంటే...
'వెన్నైతాండి వరువాయ" చిత్రం తర్వాత చాలా కాలంగా తెలుగు, తమిళ భాషల్లో సరైన విజయం లభించని త్రిషకు అజిత్ 'మంకతా" రూపంలో విజయం లభించింది. ఆగస్ట్ 31న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోందట. అజిత్ నటించిన యాభైయవ చిత్రం కావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని, రానున్న రోజుల్లో 'మంకత" మరింతగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం వుందని చ్నై ట్రేడ్ వర్గాలు చెబుతుండటంతో త్రిష ఆనందానికి అంతులేకుండా పోతోందట. అంతే కాకుండా ఈ చిత్రం తెలుగులో 'గేంబ్లర్"గా విడుదల కాబోతుండటంతో ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయాన్ని సాధించి తనకు పూర్వ వైభవాన్ని అందిస్తుందని త్రిష భావిస్తోందట.
త్రిషకు పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్ మార్" ఆశించిన విజయాన్ని అందించలేక పోయిన విషయం తెలిసిందే. కాగా 'గేంబ్లర్"గా తెలుగులో అనువాదం కానున్న చిత్రాన్ని ఇటీవల ఓ విజయవంతమైన అనువాద చిత్రాన్ని అందించిన నిర్మాత అనువదించనున్నారని సమాచారం. తెలుగులో కూడా 'మంకతా" విజయవంతమైతే చాలా కాలంగా రెండు భాషల్లోనూ విజయం కోసం ఎదురు చూస్తున్న త్రిష ఆనందానికి హద్దే వుండదు.


Click it and Unblock the Notifications











