త్రిష-లక్ష్మీ మద్య యుద్ధానికి ఆ సినిమా సక్సెసే కారణం...!?
తమిళంలో అజిత్ నటించిన చిత్రం 'మంగాత్తా". అజిత్ 50వ చిత్రంగా రూపొందిన ఇందులో అజిత్ కు జోడీగా త్రిష నటించింది. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగులో 'గ్యాంబ్లర్" పేరుతో ఈ నెల 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఇందులో త్రిష పాత్ర నిడివి తక్కువగా వుండటంతో త్రిషకు ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడం వల్లే 'మంగాత్తా"లో నటించిందని చ్నై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఈ వార్తలపై త్రిష మాట్లాడుతూ 'అజిత్ కు నేను వీరాభిమానిని. అందుకే 'మంగాత్తా"లో నా పాత్ర చిన్నదా పెద్దదా అని ఆలోచించలేదు. దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్ చెప్పగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించాను. అజిత్ నటించిన యాభైయ్యవ చిత్రంలో నేనూ ఓ భాగమైనందుకు ఆనందంగా వుంది. నా దృష్టిలో ఆయనొక నిజమైన సూపర్ స్టార్ అంది. త్రిష, లక్ష్మీరాయ్, అంజలి లు హీరోయిన్ గా నటించినా. వారికంటే త్రిష ఈ చిత్రంలో అందాల్ని ఆరబోసిందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ చిత్రానికి సక్సెస్ కి త్రిష అందాల ఆరబోతే...ఈ విషయంలో మెయిన్ క్యారెక్టర్ చేసిన లక్ష్మీరాయ్ కి, త్రిష పోటినెలకొందని వారి మద్య చిన్నపాటు యుద్దమే జరిగిందని వార్తలు వస్తున్నాయి. దీన్ని త్రిష ఖండిస్తోంది. చక్కటి గేమ్ లాంటి చిత్రమనీ, ఎక్కడా గ్లామర్ శృతిమించలేదనీ, అయితే వ్యాపార హంగులు మాత్రం ఉంటాయనీ, దీనికే పెద్ద రాద్దాంతం చేస్తున్నారని విమర్శిస్తోంది. వ్యాపార హంగులంటే.. గ్లామర్ ఆరబోయడమే కదా... అంటే ఇన్ డైరెక్ట్ గా చేశాను అనే చెబుతుంది.
మరి ఆ హంగులు ఎలా ఉంటాయో త్వరలో తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్న ఈ చిత్రం ద్వారా చూడవచ్చు అంటోంది. నాకు ఎలాంటి అవకాశాలు రాకపోవడం వల్లే ప్రాముఖ్యత లేని పాత్రల్ని అంగీకరిస్తున్నానని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి అర్థం లేని ఆరోపణలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదు అంటోంది త్రిష.


Click it and Unblock the Notifications











