మద్యానికి బదులు.. ప్రముఖ సినీనటి కొడుకు దారుణం.. ఐసీయూలో చేరిక
కరోనావైరస్ సామాన్య ప్రజలకే కాకుండా సెలబ్రీటలకు కూడా పలు కష్టాలు తెచ్చిపెడుతున్నది. దేశవ్యాప్తంగా ప్రజలు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. కరోనావైరస్‌ను తరిమి కొట్టడానికి త్యాగాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి క్రమంలో కొందరు బలహీన మనస్తత్వం కలిగిన వారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ సినీయర్ నటి కుమారుడు విషాదం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

హాస్యనటిగా మనోరమ
దక్షిణాది చిత్ర పరిశ్రమలో 1000కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన నటి మనోరమ. ఆమె మరణంతో చక్కటి హాస్య నటిని కోల్పోయింది. తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అలాంటి గొప్ప నటికి భూపతి అనే కుమారుడు ఉన్నాడు. పలు చిత్రాల్లో ఆయన కూడా నటించారు. అయితే యాక్టింగ్‌లో అంతగా క్లిక్ కాకపోవడంతో పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయారు.

కుమారుడు మద్యానికి అలవాటుతో
నటనకు దూరమైన భూపతి మద్యానికి అలవాటు పడటంతో అనేక సమస్యలకు దారి తీసింది. తల్లి బతికి ఉన్నంత కాలం తన బాధలను భరించింది. ఎన్నో చేదు సంఘటనలను ఆమె తట్టుకొన్నది. అయితే తాజాగా ఆయన మద్యానికి బానిస ఆరోగ్యం విషమించేంత వరకు తెచ్చుకొన్నారు.

లాక్‌డౌన్ అమలుతో
కరోనా కారణంగా తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నది. వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేశారు. ఈ క్రమంలో మద్యం దొరకకపోవడంతో భూపతి దారుణమైన నిర్ణయం తీసుకొన్నారు. మద్యం దొరకలేదన్న బాధతో పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడు.
Recommended Video

చెన్నై హాస్పిటల్ ఐసీయూలో
భూపతి ఆరోగ్యం విషమించడంతో చెన్నై థౌజండ్ లైట్స్‌లోని అపోలో హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స నందిస్తున్నారు. ఆయన పరిస్థితిపై భార్య ధనలక్ష్మి, కూతురు మీనాక్షి ఆందోళనగా ఉన్నారు. కొందరు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











