కిడ్నీలు ఫెయిల్.. ఆసుపత్రి పాలయిన సీనియర్ నటుడు!

ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా నటులు అనారోగ్యం పాలవుతున్నారు. కొందరు కరోనా కారణంగా ఆసుపత్రి పాలవుతుంటే మరికొందరు ఇతర ఇతర కారణాల కారణంగా ఆసుపత్రుల పాలవుతున్నారు. తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లు సమాచారం. తమిళంలో ఎక్కువగా విలన్ తరహా పాత్రలు పోషించిన మన్సూర్ అలీ ఖాన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం. ఈ మేరకు తమిళ నడిగర్ సంఘం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది..

కిడ్నీలో పెద్ద రాయి ఏర్పడడంతో ఆయన కిడ్నీలు పనిచేయడం మానేశాయి అని ప్రస్తుతం ఆయనను హాస్పిటల్లో చేర్చామని నడిగర్ సంఘం పేర్కొంది. వీలైనంత త్వరలో ఆయనకి శస్త్ర చికిత్స చేసి ఆ కిడ్నీలో రాయి తొలగిస్తామని పేర్కొన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం మన్సూర్ అలీ ఖాన్ అనవసరమైన వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల క్రితం మరణించిన తమిళ నటుడు వివేక్ మరణానికి కారణం ఆయన వేసుకున్న వ్యాక్సిన్ అంటూ మన్సూర్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Mansoor Ali Khan hospitalised and to undergo surgery

వివేక్ మృతదేహం ఉన్న ఆస్పత్రి బయట ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో పోలీసులు ఆయన మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేసులు నమోదు చేశారు. అంతేకాక ఇక అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించాడు అని చెబుతూ పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు. కొన్నాళ్ళ తర్వాత ఆయనకు బెయిల్ లభించి జైలు నుంచి విడుదలయ్యారు. నిజానికి మన్సూర్ అలీఖాన్ మొన్న జరిగిన తమిళ ఎన్నికల్లో సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి చూసారు. కానీ జనం డబ్బు తీసుకుని ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు అంటూ ఆయన పోటీ చేయకుండా నామినేషన్ వెనక్కు తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X