పెళ్లైన హీరోతో...యంగ్ హీరోయిన్ ..రిలేషన్, తల్లి కంగారుగా పెళ్లి ఏర్పాట్లు

బబ్లి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ యంగ్ హీరోయిన్ ... తనకు జంటగా సినిమా లు చేసిన హీరోతో రిలేషన్ పెట్టుకుందని హాట్ గాసిప్ వినపడుతోంది.

By Srikanya

చెన్నై: హీరోలు, హీరోయిన్స్ రిలేషన్స్ గురించి జనం ఎప్పుడూ ఆసక్తిగా మాట్లాడుకుంటూనే ఉంటారు. అందులో వింతేమిలేదు. వాళ్ల ఎఫైర్స్ గురించి మీడియా కూడా ఎప్పటికప్పుడు తమదైన శైలిలో గాసిప్స్ వండి వడ్డిస్తూంటుంది. అయితే ఈ గాసిప్స్ మధ్యలో ఏదన్నా నిజమైన వార్త వచ్చినా తెలియదు. ఇదంతా ప్రక్కన పెడితే.. ఇప్పుడు తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ యంగ్ హీరోయిన్ పై హాట్ గాసిప్ వినిపిస్తోంది.

అదేమిటంటే...బబ్లి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ యంగ్ హీరోయిన్ ...ఈ మధ్యకాలంలో తనకు జంటగా వరసగా సినిమా లు చేసిన హీరోతో రిలేషన్ పెట్టుకుందని చెప్పుకుంటున్నారు. ఆ విషయమై అక్కడ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆ హీరోకు ఆల్రెడీ పెళ్లైందని, అది వీరి అనుబంధానికి అడ్డం కాలేదని చెప్పుకుంటున్నారు.

Married Top Hero Affair With Young Heroine

ఇక రీసెంట్ గా ఈ హీరో భార్య...ఆ హీరోయిన్ తల్లిని కలిసి, విషయం చెప్పి..కాస్త కూతురుని కంట్రోలు చేసి కాపురం నిలబెట్టమని కోరిందని, దానికి ఆ తల్లి..సరే, నా కుమార్తెకు వివాహం చేస్తానని మాట ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. దాంతో ఇప్పుడు ఆ హీరోయిన్ కు సంభందాలు చూడటం మొదలెట్టిందిట ఆ తల్లి. అంతేకాని కూతురుని మాత్రం నిలదీయలేదట.

యంగ్ హీరోయిన్ మాత్రం తేలు కుట్టిన దొంగలా...తల్లి చర్యలకు అడ్డం పడటం లేదట. ఎందుకంటే ఆమెను కాదు అంటే...తన విషయం బయిటకు వచ్చి ఇంట్లో గొడవలు వస్తాయని భయపడుతోంది. గతంలోనూ ఈ హీరోయిన్ మరో హీరోతో ప్రేమ వ్యవహారాలు నడిపి బ్రేకప్ అయ్యిందట. ఆ హీరోయిన్ తెలుగులోనూ సినిమాలు చేసిందని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X