కమల్ తవ్వి తీస్తున్నాడు..బి రెడీ

By Srikanya

'Marudhanayagam can be revived any time'
చెన్నై : కమల్ హాసన్ ఏం చేసినా, ఏం తీసినా సంచలనమే. విశ్వరూపం హిట్ తో ఫామ్ లోకి వచ్చిన కమల్...షూటింగ్ దశలో ఆగిపోయిన తన పాత స్క్రిప్టుని తవ్వి తీసే పనిలో ఉన్నారట. అవును మీరు ఊహ కరెక్టే. 'మరుదనాయగం' మళ్లీ పట్టాలెక్కనుంది. నిత్య ప్రయోగాలకు పెట్టింది పేరైన ఆయన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ 1997లో 'మరుదనాయగం' షూటింగ్ ను ప్రారంభించారు.

ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అప్పట్లో సంచలనమైంది. సుమారు రూ. వంద కోట్ల బడ్జెట్‌ అంటూ ప్రచారం జరిగింది. కొన్నిరోజుల చిత్రీకరణ అనంతరం బడ్జెట్‌ సమస్యతో ప్రాజెక్టు ఆగింది. మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు కమల్‌హాసన్‌ శతవిధాలా ప్రయత్నించినా అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత విరామం లేకుండా ఆయన మిగతా చిత్రాల్లో బిజీగా మారిపోయారు.

ఇదిలా ఉంటే హాలీవుడ్‌కు చెందిన 'ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో' ఈ చిత్రాన్ని నిర్మించేందుకు తాజాగా ముందుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. కమల్‌హాసన్‌ స్పందిస్తూ.... '' 'మరుదనాయగం' భారీ వ్యయంతో కూడిన చిత్రం. తమిళంతో పాటు ఆంగ్లం, ఫ్రెంచిలో దీన్ని రూపొందించనున్నాం. దీన్ని నిర్మించేందుకు స్థానికులు ముందుకు రావడం కష్టమే. త్వరలోనే ఈ చిత్రాన్ని పునఃప్రారంభిస్తాము''ని పేర్కొన్నారు.

విశ్వనటుడు కమల్‌హాసన్‌ చిత్రాలు మూడు ఈ ఏడాది విడుదల కానున్నాయన్న సమాచారంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రోజురోజుకూ వేగాన్ని పెంచుతున్న ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా కమల్‌ నటించిన 'విశ్వరూపం-2' ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల చెంతకు రానుంది.

తన స్నేహితుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న 'ఉత్తమ విలన్‌' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమయి శరవేగంగా కొనసాగుతోంది. దీని చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట రమేష్‌ అరవింద్‌. సెప్టెంబరులో చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిశ్చయించారట. కమల్‌ నటించనున్న మూడో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మలయాళంలో సంచలన విజయం సాధించిన 'దృశ్యం' రీమేక్‌లో కమల్‌ నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటించేందుకు మీనా, నదియా, సిమ్రాన్‌ తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు గౌతమిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఉత్తమ విలన్‌' చిత్రీకరణ పూర్త్తెన వెంటనే ఆగస్టులో 'దృశ్యం' రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణకు ఎక్కువరోజులు పట్టే కథ కాకపోవటంతో త్వరగానే పూర్తి చేసి డిసెంబరులోగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X