ఎస్పీబీ కోసం సామూహిక ప్రార్థన.. హీరో కార్తీ, జీవీ ప్రకాష్ ట్వీట్స్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం, అది కాస్తా సీరియస్ అవ్వడం, ఐసీయూ నుంచి వెంటిలేటర్‌పైకి తరలించడం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం కాస్త కుదుటపడుతూనే ఉందని ఎస్పీ చరణ్ మీడియాతో చెప్పుకొచ్చారు. బాలు ఆరోగ్యంపై యావత్ భారత సంగీత ప్రియులంతా ఆందోళన చెందుతున్నారు.

ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని, సామూహిక ప్రార్థనలు చేయాలని మన తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వంటి వారు ముందడుగు వేశారు. చంద్రబోస్, చిరంజీవి, ఇళయ రాజా, ఏఆర్ రెహ్మాన్, రజినీ కాంత్, కమల్ హాసన్ వంటి వారంతా బాలు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో సామూహిక ప్రార్థనలపై హీరో కార్తీ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్పందించారు.

Mass Prayer For Sp BalasubrahManyam Hero Karthi And GV Prakash

హీరో కార్తీ స్పందిస్తూ.. 'మనకు ఎంతో ప్రియమైన ఎస్పీబీ సర్ త్వరగా కోలుకోవాలని, రేపు (ఆగస్ట్ 20) సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు సామూహికంగా ప్రార్థనలు చేద్దాం. మేమంతా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాము ఎస్పీబీ సర్' అంటూ చెప్పుకొచ్చాడు.

ఎస్పీబీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని వెంటనే కోలుకోవాలని సామూహిక ప్రార్థనాలు చేద్దాం. ఆగస్ట్ 20 సాయంత్రం ఆరు గంటలకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మళ్లీ మనమంతా ఆయన గొంతును వినేలా చేద్దాం. త్వరగా కోలుకోండి ఎస్పీబీ సర్ అంటూ జీవీ ప్రకాశ్ కుమార్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X