మొన్న థియేటర్ బద్దలు కొట్టి.. నేడు పాలాభిషేకం, అజిత్ ఫ్యాన్స్‌‌కు తప్పిన పెను ప్రమాదం!

Recommended Video

అజిత్ ఫ్యాన్స్‌‌కు తప్పిన పెను ప్రమాదం!

ఇండియాలో సినీ హీరోలని ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోల్ని దైవంగా ఆరాధించే అభిమానులు సౌత్ లో ఎక్కువగా కనిపిస్తారు. హీరోల అభిమానుల మధ్య వివాదాలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉండగా తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్, అజిత్ లకు వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయ్యే సమయంలో వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భంలో అభిమానుల సంబరాలు ప్రమాదంగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది.

బడా హీరోల చిత్రాలు ఒకేరోజు

బడా హీరోల చిత్రాలు ఒకేరోజు

సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల చిత్రాలు సందడి చేస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్ నటించిన పేట, విశ్వాసం రెండు చిత్రాలు నేడు విడుదలయ్యాయి. అటు అజిత్ ఫ్యాన్స్, ఇటు రజని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల సంబరాలు ఊహించని ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. విల్లుపురంలోని ఓ థియేటర్ వద్ద 30 అడుగుల కటౌట్ నుంచి అభిమానులు పడిపోయిన ఘటన చోటు చేసుకుంది.

30 అడుగుల కటౌట్

అజిత్ అభిమానులు విల్లుపురంలోని ఓ థియేటర్ వద్ద 30 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. నేడు విశ్వాసం విడుదుల సందర్భంగా అజిత్ కటౌట్ కు పాలాభిషేకం చేయాలని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. అరడజనుకు పైగా అభిమానులు కటౌట్ పైకి ఎక్కారు. కటౌట్ దృడంగా లేకపోవడంతో విరిగి పడిపోయింది. కటౌట్ నెమ్మదిగా పడడంతో పెను ప్రమాదమే తప్పింది. కొంతమంది అభిమానులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఆ ప్రకటన చేసిన తొలి హీరో

ఆ ప్రకటన చేసిన తొలి హీరో

అజిత్ అభిమానుల చర్యలు ఎక్కువగా వివాదం అవుతుండడంతో.. తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అజిత్ తేల్చి చెప్పేశాడు. ఇలాంటి ప్రకటన చేసిన తొలి హీరో అజిత్ అని చెప్పొచ్చు. అయినా కూడా ఫ్యాన్స్ అజిత్ పై వీరాభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

థియేటర్ బద్దలు కొట్టి

థియేటర్ బద్దలు కొట్టి

ఇటీవల అజిత్ అభిమానులు కొందరు థియేటర్ బద్దలు కొట్టి తొలి రోజు టికెట్స్ దక్కించుకున్న ఘటన చోటు చేసుకుంది. అజిత్ ఫ్యాన్స్ కొందరు ఎల్ఈడీ కటౌట్ ని కూడా నిర్మించారు. తమిళనాడు వ్యాప్తంగా హీరోకు ఎల్ఈడీ కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఎన్ని ఘటనలు జరిగినా అజిత్ అభిమానులు మాత్రం తగ్గడం లేదు. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X