మాస్టర్ దర్శకుడికి కరోనా పాజిటివ్.. ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్
తమిళంలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన లోకేష్ వైద్య పరీక్షలు జరిపించుకోగా ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ట్విట్టర్‌లో లోకేష్ కనకరాజ్ భావోద్వేగమైన పోస్టును పెట్టారు. అందరికి నమస్కారం. నా స్నేహితులు, ఫ్యామిలీ, సన్నిహితులకు తెలియజేసేది ఏమిటంటే.. నాకు కోవిడ్ 19 పాజిట్ అని వైద్యులు నిర్ధారించారు. నేను ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాను. త్వరలోనే ఈ వ్యాధి నుంచి బయటపడి మరింత మానసిక స్థైర్యంతో తిరిగి వస్తాను అని లోకేష్ కనకరాజ్ ట్వీట్ చేశారు.

తమిళ ఇళయదళపతి విజయ్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదిలో భారీ విజయాన్ని అందుకొన్నది. తొలివారంలోనే రూ.100 కోట్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సుమారు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
ఇక లోకేష్ కనకరాజ్ తన తదుపరి చిత్రాన్ని విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి విక్రమ్ అనే పేరును ఖారారు చేశారు.


Click it and Unblock the Notifications











