విజయ్ ‘మాస్టర్’పై రూమర్స్.. ఖండించిన చిత్రయూనిట్
దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతోన్న మాస్టర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ వల్ల ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ మూవీపై విడుదలపై రకరకాలు పుకార్లు వినిపించసాగాయి. నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ విడుదల కానుందని రూమర్లు ఎక్కువయ్యాయి. అలాంటి వార్తలను ఖండిస్తూ.. చిత్రయూనిట్ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
'ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితిపై మనం ఇంకా పోరాడుతూనే ఉన్నాం.. అందరూ క్షేమంగానే ఉన్నామని భావిస్తున్నాం. మాస్టర్ సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయాలన్న మీ ఉత్సాహాన్ని సంబరాలను మేం అర్థం చేసుకోగలం. ఆ రోజు త్వరలోనే రావాలని మేం కూడా కోరుకుంటున్నాం. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయంపై వస్తోన్న రూమర్లకు ఓ క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన చేస్తున్నాం.

మాకు ఓటీటీ సంస్థల నుంచి డీలింగ్స్ వచ్చాయి కానీ.. మేం మాత్రం థియేటర్లో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపాం. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో వెనక్కి వెళ్లిన మన చిత్ర పరిశ్రమకు తోడుగా ఉందామని ఆ నిర్ణయం తీసుకున్నాం. తమిళ చిత్ర పరిశ్రమ మళ్లీ పుంజుకునేందుకు థియేటర్ల యాజమాన్యం కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మంచి శుభవార్తతో మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటామని ఆశిస్తున్నాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండ'ని క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











