మళ్లీ హాస్పిటల్‌లో చేరిన కెప్టెన్ విజయ్‌కాంత్.. రూమర్లు నమ్మొద్దు అంటూ
తమిళ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను మరోసారి హాస్పిటల్‌లో చేర్పించారు. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని ఎంఐఓటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చేర్పించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం విజయ్ కాంత్‌ను డిశ్చార్జి చేశారు. అయితే మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్టు డీఎండీకే పార్టీ అధికారికంగా ప్రకటనను జారీ చేసింది.
డీఎండీకే నేత కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవానికి ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. దయచేసి కెప్టెన్ ఆరోగ్యంపై మీడియాలో వచ్చే రూమర్లను నమ్మొద్దు అని పార్టీ తమ ప్రకటనలో పేర్కొన్నారు.

స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్‌కాంత్ వైద్య పరీక్షలు చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో సెప్టెంబర్ 22వ తేదీన ఎంఐఓటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చేరారు. కొద్ది రోజుల తర్వాత ఆయన భార్య ప్రేమలతకు కూడా కరోనాపాజిటివ్ అని తేలడంతో ఆమె కూడా చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వారిద్దరిని డిశ్చార్జి చేశారు. మళ్లీ కెప్టెన్ ఆరోగ్యం కాస్త క్షీణించడంతో హస్పిటల్లో చేరిన ఆయన ఆరోగ్యంపై రూమర్లు రావడంతో పార్టీ ఖండించింది.
సీనియర్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ డీఎండీకే పార్టీని స్థాపించి వ్యవస్థాపకుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య ప్రేమలత పార్టీ కోశాధికారి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











