మళ్లీ వస్తోన్న మీనా
పెళ్లి చేసుకున్న తర్వాత కథానాయికలు సినిమాలకు స్వస్తి పలికే రోజులు కావివి. వివాహానంతరం కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంటున్నారు నేటి కథానాయికలు. ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అయితే పెళ్లి తర్వాత ఇంకా బిజీ అయిపోయింది. ఇప్పుడు మీనా కూడా అదే దారిన నడవనున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి విధ్యాసాగర్ ని వివాహం చేసుకున్న మీనా సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకుంది.
ఇటీవలే 'విడాదే పిడి' అనే తమిళ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకరించారు. 'విడాదే పిడి' అంటే వదలద్దు పట్టుకో అని అర్థం. తనకెంతో ఇష్టమైన సినిమాలను వదులుకోవద్దు అన్నది ఆమె నిర్ణయం. దీని గురించి మీనా మాట్లాడుతూ "సినిమాలంటే నాకు చిన్నప్పటి నుండీ చాలా ఇష్టం. జీవితాంతం నటిగా కొనసాగాలనుకున్నాను. మా ఆయన కూడా నా ఇష్టాన్ని వ్యతిరేకించకపోవడం తో ఈ చిత్రం లో నటించడానికి సమ్మతించాను" అని చెప్పుకొచ్చింది. ఇంకేం భర్త అనుమతి దొరికింది...కానీ ఇప్పుడున్న కథానాయికల మధ్య నాయికగా నెట్టుకురావడం మీనాకు కష్టమైన పనే..


Click it and Unblock the Notifications











