For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బూతులతో రెచ్చిపోయిన మీనా.. నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు

|

అచ్చ తెలుగు అమ్మాయి పాత్రైనా, అమాయకపు పాత్రైనా, నెగెటివ్ రోల్ అయినా, కంటతడి పెట్టించే క్యారెక్టర్.. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటించే మీనా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాక.. సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అప్పుడప్పుడు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. చివరగా దృశ్యం సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. అయితే మళ్లీ తెలుగులో ఇంతవరకు మరోసినిమాకు ఓకే చెప్పలేదు.

 వెబ్ సిరీస్‌ల హవా..

వెబ్ సిరీస్‌ల హవా..

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతూ ఉండగా.. అందరూ దానిపై దృష్టి పెట్టసాగారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా వెబ్ సిరీస్‌లు దూసుకుపోతున్నాయి. పెద్ద స్టార్లు సైతం వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నారు. ఇక హీరోయిన్లైతే బోల్డ్ కంటెంట్‌లతో రెచ్చిపోతోన్నారు.

తాజాగా మీనా కూడా ఎంట్రీ..

రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సెలెక్టెడ్ పాత్రల్నే చేస్తూ ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ బోల్డ్ కంటెంట్ ఉన్న తమిళ వెబ్ సిరీస్ లో మీనా నటించింది. దీంట్లో మీనా రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. అమాయకంగా ఉంటే నవ్వులు పూయిస్తూ.. తిట్ల దండకంతో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది.

బూతు డైలాగ్‌లతో రెచ్చిపోయిన మీనా..

బూతు డైలాగ్‌లతో రెచ్చిపోయిన మీనా..

‘కరోలిన్ కామాక్షి' అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో మీనా బూతులు తిడుతూ ఉండడం అందరినీ షాక్ కు గురిచేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో గన్ పట్టుకుని యాక్షన్ సీన్స్ లో పాల్గొంటుంది మీనా. మద్యం సేవించే సన్నివేశాలు కూడా ఉన్నా. ట్రైలర్ చివర్లో మీనా మద్యం మత్తులో చెప్పే బూతు డైలాగులు వైరల్ అవుతున్నాయి. మీనా ఏంటి ఇలాంటి డైలాగ్‌లు చెప్పడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
దక్షిణాదిన ఊపందుకున్న వెబ్ సిరీస్‌లు

దక్షిణాదిన ఊపందుకున్న వెబ్ సిరీస్‌లు

బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లు ఇప్పటికే ఓ రేంజ్‌లో వైరల్ అవుతుండగా.. వాటి ప్రభావం దక్షిణాదినా పడింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ హిట్ కాగా.. మరో సీజన్‌ను కూడా తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్‌లో హిట్ అయిన లస్ట్ స్టోరీస్‌ను.. దక్షిణాదినా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
Meena Acted In Karoline Kamakshi Web Series. Her Bold Dialogues Goes Viral.Netizens Trolling On Meena Character. Let's See Karoline Kamakshi Will Be Successful Or Not.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more