Don't Miss!
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బూతులతో రెచ్చిపోయిన మీనా.. నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు
అచ్చ తెలుగు అమ్మాయి పాత్రైనా, అమాయకపు పాత్రైనా, నెగెటివ్ రోల్ అయినా, కంటతడి పెట్టించే క్యారెక్టర్.. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటించే మీనా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాక.. సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అప్పుడప్పుడు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. చివరగా దృశ్యం సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. అయితే మళ్లీ తెలుగులో ఇంతవరకు మరోసినిమాకు ఓకే చెప్పలేదు.
వెబ్ సిరీస్‌ల హవా..
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతూ ఉండగా.. అందరూ దానిపై దృష్టి పెట్టసాగారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా వెబ్ సిరీస్‌లు దూసుకుపోతున్నాయి. పెద్ద స్టార్లు సైతం వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నారు. ఇక హీరోయిన్లైతే బోల్డ్ కంటెంట్లతో రెచ్చిపోతోన్నారు.
తాజాగా మీనా కూడా ఎంట్రీ..
రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సెలెక్టెడ్ పాత్రల్నే చేస్తూ ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ బోల్డ్ కంటెంట్ ఉన్న తమిళ వెబ్ సిరీస్ లో మీనా నటించింది. దీంట్లో మీనా రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. అమాయకంగా ఉంటే నవ్వులు పూయిస్తూ.. తిట్ల దండకంతో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది.
బూతు డైలాగ్‌లతో రెచ్చిపోయిన మీనా..
‘కరోలిన్ కామాక్షి' అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో మీనా బూతులు తిడుతూ ఉండడం అందరినీ షాక్ కు గురిచేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో గన్ పట్టుకుని యాక్షన్ సీన్స్ లో పాల్గొంటుంది మీనా. మద్యం సేవించే సన్నివేశాలు కూడా ఉన్నా. ట్రైలర్ చివర్లో మీనా మద్యం మత్తులో చెప్పే బూతు డైలాగులు వైరల్ అవుతున్నాయి. మీనా ఏంటి ఇలాంటి డైలాగ్‌లు చెప్పడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
Recommended Video
దక్షిణాదిన ఊపందుకున్న వెబ్ సిరీస్‌లు
బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లు ఇప్పటికే ఓ రేంజ్లో వైరల్ అవుతుండగా.. వాటి ప్రభావం దక్షిణాదినా పడింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ హిట్ కాగా.. మరో సీజన్‌ను కూడా తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్లో హిట్ అయిన లస్ట్ స్టోరీస్‌ను.. దక్షిణాదినా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.