నమిత నిర్మాతలతో కుమ్మక్కై ..మీరా చోప్రా
జగన్మోహిని రీమేక్ లో నమిత, మీరా చోప్రా కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మీరా చోప్రా తన పాత్రను కావాలని ఎడిటింగ్ టేబుల్ పై కట్ చేసారని, అది నమిత పనేనని కంప్లైయింట్ చేస్తోంది.నమిత చెప్పినట్లు దర్శక, నిర్మాతలు విని తనను మానసికింగా బాధ పెడుతున్నారని అంటోంది. మొదట ఈ చిత్రం కథ చెప్పినప్పుడు, షూటింగ్ జరిగినప్పుడు తన పాత్ర సినిమాలో దాదాపు అరగంట పైనే ఉందని, తనకూ నమితతో సమాన ప్రాధాన్యత ఉందనే ఒప్పుకున్నానని, అయితే ఇప్పుడు సినిమా చూసి షాక్ అయ్యానని అంటోంది. అలాగే తనకు రిలీజ్ డేట్ ఒకటి చెప్పి మరోరోజున రిలీజ్ చేసారని అంటోంది. తన పాత్ర తగ్గించి మొత్తం ఫోకస్ ని నమిత వైపుకు తిప్పేలా జాగ్రత్తగా ఎడిటింగ్ చేయించారని అంటోది. అయినా తాను ఎవరినీ నిందించనని తన పాత్ర కూడా ఉండి ఉంటే నిండుతనం వచ్చేదని వాపోతోంది. అలాగే పోస్టర్స్ పైన కూడా తనను స్టాంప్ సైజులో వేసారని అంటోంది. వీటికి తోడు తనను చిత్రం ప్రమోషన్ కు పిలవలేదని మొత్తుకుంటోంది. అయితే సినిమా ప్లాఫ్ అయి ఓ ప్రక్క మేం బాధపడుతూంటే మధ్యలో నీ గోలేందమ్మా అని నిర్మాతలు ఇది విని విసుక్కుంటున్నారని తమిళ పరిశ్రమలో వినపడుతోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











