పవన్ హీరోయిన్ కి సైడ్ బిజినెస్సే బావుంది
పవన్ కళ్యాణ్ సరసన బంగారం చిత్రంలో నటించిన మీరా చోప్రా ఆ తర్వాత కేవలం వాన, మారో, జగన్మోహిని చిత్రాల్లోనే నటించింది. మారో చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఆమె ఖాళీగా ఉంది. అయితే అందుకు ఆమె భాధపడటం లేదు. తనకున్న సైడ్ బిజెనెస్ బాగుండుటం వల్లే సినిమాలపై దృష్టి పెట్టలేదంటోంది. ఇంతకీ ఏమిటా సైడ్ వ్యాపారం అంటే హోటల్ బిజెనెస్. ఆమెకు శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఓ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అలాగే న్యూ ఢిల్లీలో కూడా హోటల్ ఆరంభించాలని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు హోటల్ బిజినెస్ మరోవైపు సినిమాలు.. రెండు పడవల మీద కాళ్లు పెట్టడంవల్లే సినిమాల సంఖ్య తక్కువగా ఉందని మీరా చోప్రా ఆమె అంటోంది.
అలాగే సినిమా పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే లౌక్యం అవసరమని అది తన దగ్గర లేదని చెప్తోంది మీరా చోప్రా. ఈ విషయాన్ని వివరంగా చెబుతూ..వాస్తవానికి నేను సినిమా పరిశ్రమకు పనికి రాను. ఇక్కడికొచ్చి దాదాపు మూడేళ్లకు పైనే అయ్యింది. కానీ పరిశ్రమను నా ఇంటిలా ఎప్పుడూ భావించలేదు. అందుకు నేనెవర్నీ నిందించడంలేదు. నాకు ఇక్కడ బాగానే ప్రోత్సాహం లభిస్తోంది. కానీ నాకు హోటల్ వ్యాపారం అంటే ఇష్టం. హోటల్ లో ఉన్నప్పుడు నా ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది' అంది.
మలయాళ, తమిళ భాషల్లో తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్దిక్ తొలిసారి తెలుగులో డైరక్ట్ చేసిన చిత్రం 'మారో'. ఐఐటి విద్యార్థిగా జీవితంలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటిని మైండ్ గేమ్ తో పరిష్కరించానని నితిన్ అంటున్నాడు. గతంలో మూడొంతులు పూర్తయి గ్యాప్ తీసుకున్న 'సత్యం శివం సుందరం' - 'మారో' గా వస్తోంది.


Click it and Unblock the Notifications











