డిజిపీని కలిసి వివరించిన మీరా చోప్రా
మీరా చోప్రాపై డిల్లీలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఆమె రీసెంట్ గా హర్యానా డీసీపి కలిసి స్టేట్మెంట్ ఇచ్చింది. తనకీ ఆ కేసుకీ ఏ సంభందం లేదనీ, మీడియా అత్యుత్సాహంతో తన పేరుని కలిపి ప్రచారం చేస్తోందని, ఆ చనిపోయిన ఆవిడ కానీ, ఆమె భర్తగానీ తనకు అస్సలు పరిచయమే లేదని తెలియచేసింది. ఇక ఈ విషయమై..అలోక్ మిట్టల్..గుర్ గాం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ..ఆమెకు ఆమె సీఆర్ పిసీ 160 సెక్షన్ ప్రకారం నోటీస్ ఇష్యూ చేసాం. ఎందుకంటే ఆమెపై నేరం మోపబడింది. ఆమెను ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) క్రింద చర్య తీసుకోవాలి అన్నారు. ఇక డిల్లీలో అనుమానస్పదంగా మరణించిన రుచి భట్టాన్ డైరీలో వివరాలను బట్టి ఈ కేసును రిజిస్టర్ చేసారు. తన భర్త సుమిత్ కీ నటి మీరా చోప్రాకి అక్రమ సంభంధం ఉండేదని, ఎప్పుడూ తనను ఆమెతో పోల్చి మాట్లాడేవాడని,అది తను తట్టుకోలేకపోయిందంటూ రుచి డైరీలో రాసింది.


Click it and Unblock the Notifications











