తెలుగు,తమిళ పరిశ్రమలో హవా కొనసాగిస్తున్నమళయాళీ భామ మీరాజాస్మిన్ ఇప్పుడు మరో పెద్ద ఆఫర్ ని చేజిక్కించుకుందని తెలుస్తోంది. అదీ ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ నిర్మాతగా వ్యవహించే నెట్ హోమ్ ప్రొడక్షన్ లో నని తెలుస్తోంది. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. బబ్లి ఇమేజ్ ఉన్న ఆమె రన్ సినిమానాటి నుండీ తమిళ్ లో మంచి క్రేజే ఉంది. అందులోనూ పందెంకోడి లోని ఆమె అల్లరి పాత్రను ఇప్పటికీ అక్కడవారు మర్చిపోలేదుట. ఇక ఈ పాత్ర మోడ్రన్ లుక్ తో ఉంటుందని,సినిమా సొసైటీపై సెటైర్స్ తో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రొబొ పనిలో బిజీగా ఉన్న శంకర్ ఈ సినిమాను ఈలోగానే పూర్తి చేసి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడుట. ఈ చిత్రానికి ఆయన శిష్యులో ఒకరు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గతంలో శంకర్ నిర్మాతగా వడివేలు హీరోగా 23వ పులకేశి,గది నెంబర్ 305లో దేముడు వంటి ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించాడు. అందుకే మీరాజాస్మిన్ కథ కూడా వినకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.