జాతీయ ఉత్తమ నటి అవార్డ్ గ్రహీత మీరా జాస్మిన్ షూటింగ్ లలో చాలా జోవియల్ గా ఉంటుందని ఆమెతో పనిచేసిన వారెవరైనా ఒప్పుకునే నిజం. అయితే ఆమె ఈ మధ్య ఆదినారాయణ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు హఠాత్తుగా భోరున ఏడుస్తూ ఉండిపోయి అందరినీ షాక్ కి గురిచేసింది. ఇంతకీ ఆ సన్నివేశం ఏమిటీ అంటే హీరోయిన్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే హీరో వచ్చి రక్షిస్తాడు. అప్పుడు ఆమె హీరోని పట్టుకుని కన్నీరు పెడుతుంది. కన్నీరు కోసం గ్లిజరిన్ కూడా పెట్టుకోకుండా ఏడ్చినట్లు నటించిన ఆమె ఆ షాట్ అవగానే ఒక్కసారి కుర్చీలో కూలబడి భోరున ఏడ్చేసింది. దాంతో ఆమె పాత్రలో లీనమై ఏడుస్తోందా లేక ఏదన్నా గుర్తు వచ్చి ఏడుస్తోందా అన్నది ఎవరికీ అర్ధంకాలేదు. అలాగని అడిగే ధైర్యం చేయలేకపోయారు. అందరూ సైలెంట్ గా ఉండి..మళ్ళి ఆమె మేకప్ టచప్ ఇచ్చుకుని రెడీ కాగానే షూటింగ్ ప్రారంభించారు. ఇంతకీ ఆమె ఎందుకు ఏడ్చినట్లు అన్నది ఇప్పటికీ ఆ యూనట్ కి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.