అతనితో ఎఫైర్ బహిర్గతం చేసిన మీరా జాస్మిన్
చెన్నయ్ : తమిళ్, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీరా జాస్మీన్ ప్రేమలో పడ్డారు. తమిళ హీర మాండలిన్ రాజేష్‌ను తాను ప్రేమిస్తున్నట్టు ఆమె తెలిపారు. పెళ్లి గురించి త్వరలోనే ఓ ప్రకటన చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మీరా ప్రకటనతో కొంత కాలంగా వీరు డేటింగ్ చేస్తున్నారనే ప్రచారపై స్పష్టత వచ్చింది.
దక్షిణాది సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మలయాళీ కుట్టీ 'మీరా జాస్మిన్' త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుంది. మీరా జాస్మిన్ ఇప్పటి వరకు సౌతిండియాలో అన్ని భాషలలో నటించింది. 'రన్" అనే తమిళ సినిమాని తెలుగు డబ్బింగ్ తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన మీరా తర్వాత తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలతో చేసింది.
పవన్ కళ్యాన్ తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర లాంటి చిత్రాలతో పాటు బాలయ్యతో కలిసి మహారథి, గోపీచంద్ హీరోగా వచ్చిన రారాజు, జగపతి బాబుతో బంగారు బాబు, శ్రీకాంత్ తో యమగోల మళ్లీ మొదలైంది, రాజశేఖర్ తో గోరింటాకు మొదలైన వారితో నటించింది.
జనరేషన్ మారుతుండడంతో కుర్ర హీరొయిన్లతో పోటీ పడలేక వెనుక పడిపోయింది మీరా. ఎలాగు సినిమా చాన్సులు లేవు కానుగ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటుంద.


Click it and Unblock the Notifications












