బిగ్ బాస్ పేరిట మోసగించారు.. కోటి డిమాండ్ చేస్తూ కంటిస్టెంట్ సంచలనం

కమలహాసన్‌ హోస్ట్ గా సాగిపోతున్న తమిళ బిగ్ బాస్ సీజన్ 3 పై సంచలన ఆరోపణలు గుప్పించింది బిగ్ బాస్ కంటిస్టెంట్ మీరా మిథున్. శనివారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఈమె తనను బిగ్ బాస్ నిర్వాహకులు మోసం చేశారని పేర్కొంటూ విరుచుకుపడింది. ఆ వివరాలేంటో చూద్దామా..

అది జరిగి రెండు నెలలు.. అయినప్పటికీ

అది జరిగి రెండు నెలలు.. అయినప్పటికీ

తాను బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో కంటిస్టెంట్‌గా పాల్గొని బయటకొచ్చానని, ఇది జరిగి రెండు నెలలు కావొచ్చినా తనకు రావాల్సిన సొమ్ము వారు ఇవ్వలేదని పేర్కొంది మీరా మిథున్. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొనందుకు తనకు ముందుగా నిర్ణియించిన పారితోషికం ఒక్క పైసా కూడా ముట్టజెప్పలేదని ఆరోపణలు గుప్పించింది.

అక్కడికి వెళ్లినా స్పందన లేదు

అక్కడికి వెళ్లినా స్పందన లేదు

ఈ విషయమై విజయ్‌ టీవీ సంస్థకు వెళ్లి అడగ్గా అక్కడ ఎవ్వరి దగ్గరి నుంచి సరైన స్పందన లేదని చెప్పింది మీరా మిథున్. తనను ఇలా మోసం చేయడమే గాక, తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. తమిళనాడులో నివాసం ఉండేందుకే రక్షణ లేని పరిస్థితిలో తాను ఉన్నానని తెలిపింది.

కోటి రూపాయల నష్ట పరిహారం.. ఇక్కడి పోలీసుల తీరు

కోటి రూపాయల నష్ట పరిహారం.. ఇక్కడి పోలీసుల తీరు

నా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తునందుకు గాను.. కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని మీరా మిథున్ డిమాండ్ చేసింది. తమిళనాడు పోలీసులు కూడా తనకు సహాకరం అందించడం లేదని ఆవేదన చెందింది. ఇక్కడ పోలీసులు లంచం తీసుకుని తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించింది.

త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా

త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా

అందరిలోనూ సామాజిక అవగాహన కలిగించాలని తాను భావిస్తున్నట్లుగా పేర్కొంది మీరా మిథున్. అందుకోసం తాను త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నానని చెప్పింది. అయితే ఏ పార్టీలో చేరతానన్నది మాత్రం ఇప్పుడే చెప్పనని నటి మీరామిథున్‌ పేర్కొంది.

మీరా మిథున్ పై విమర్శలు.. చివరకు

మీరా మిథున్ పై విమర్శలు.. చివరకు

మోడలింగ్‌ రంగం నుంచి సినీరంగానికి పరిచయం అయింది మీరా మిథున్. అందాల పోటీల్లో విస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఈమె.. ఆ తర్వాత సొంతంగా అందాల పోటీలను నిర్వహించడానికి సిద్దమై పలు విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్ గా ఉండి.. ఇప్పుడు సంచలన ఆరోపణలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X