వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి.. బయటపెట్టానా ఇక అంతే! బిగ్ బాస్ కంటిస్టెంట్ సంచనలం

స్టార్ హీరో కమల్ హాసన్‌పై బిగ్ బాస్ కంటిస్టెంట్, నటి మీరా మిథున్ చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) ఉందన్నట్లుగా పేర్కొంటూ కమల్ హాసన్‌పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది మీరా మిథున్. దీంతో ఈ ఇష్యూ కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. మీరా మిథున్- కమల్ హాసన్ మధ్య అసలేం జరిగింది? మీరా ఎందుకిలా మాట్లాడుతోంది? వివరాల్లోకిపోతే..

తన కూతురు కోసం.. నన్ను!

తన కూతురు కోసం.. నన్ను!

కోలీవుడ్‌లో నెపోటిజం పీక్స్‌లో ఉందని అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది మీరా మిథున్. తనకు వచ్చిన సినిమా అవకాశాన్ని తప్పించి, తన స్థానంలో తన కూతురు అక్షర హాసన్‌ని ఎంపిక చేసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తూ హల్చల్ చేస్తోంది మీరా మిథున్. క్రమంగా ముదిరిన ఈ వివాదం సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది.

అక్షరా హాసన్‌‌కి సిగ్గుగా అనిపించడం లేదా?

అక్షరా హాసన్‌‌కి సిగ్గుగా అనిపించడం లేదా?


కోలీవుడ్‌లో నెపోటిజం పీక్స్‌లో ఉందనేది ప్రూవ్ అయింది. సినిమా నుంచి నన్ను తప్పించి తన కూతురికి అవకాశం వచ్చేలా కమల్ హాసన్ ప్లాన్ చేశాడు. ఇలా చేసినందుకు దర్శకుడు నవీన్‌కు, అక్షరా హాసన్‌కు, నిర్మాత శివకు సిగ్గుగా అనిపించడం లేదా? వారికి డబుల్ స్టాండర్డ్స్ బుద్ధి ఉందని బాగా తెలుస్తోంది అని మీరా తన ట్వీట్ లో పేర్కొంది.

దర్శకుడు నవీన్ వెంటనే స్పందిస్తూ

దర్శకుడు నవీన్ వెంటనే స్పందిస్తూ


దీంతో మీరా చేసిన ఈ ఆరోపణలపై దర్శకుడు నవీన్ వెంటనే స్పందించాడు. ‘అగ్ని సిరాగుగల్ అనే ఆ సినిమాలో మొదట షాలినీ పాండేను తీసుకుందాం అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో అక్షర హాసన్‌ను ఎంపిక చేశాం. కాబట్టి ఈ సినిమాలో అక్షర హాసనే కథానాయిక. అసలు ఈ మూవీ కోసం మేము మీరా మిథున్‌ను ఎంపిక చేసుకోలేదు. ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోంది. మొదట ఆమె మాటలు పట్టించుకోకూడదని అనుకున్నా, కానీ జరుగుతున్న ఈ రాద్దాంతం చూసి స్పందిస్తున్నా అని నవీన్ పేర్కొన్నాడు.

వీడియో ప్రూఫ్స్ ఉన్నాయనేసిన నటి

వీడియో ప్రూఫ్స్ ఉన్నాయనేసిన నటి

ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. తిరిగి మీరా స్పందిస్తూ.. నువ్వు నన్ను నీ సినిమాలో తీసుకున్నావనడానికి నా వద్ద ఆడియో, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. వాటిని బయటపెడితే నీకే కాదు నీ ఫ్యామిలీకి కూడా నష్టమే. బయటపెట్టమంటావా?' అని బెదిరించడం సెన్సేషన్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X