విజయ్, సూర్య అసలు మీరు మగాళ్లేనా.. గాజులు, చీర పంపుతా వేసుకోండి.. స్టార్ హీరోయిన్ ఫైర్

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు వనిత విజయకుమార్ కి సంబంధించిన వివాదాలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో బ్యూటీ వివాదాల డోస్ పెంచుతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కోలీవుడ్ స్టార్స్ ని టార్గెట్ చేస్తోంది. ఆమె మరెవరో కాదు మొన్నటివరకు త్రిషపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన మీరా మిథున్. ఇప్పుడు విజయ్, సూర్యలపై ఎవరు ఊహించని విదంగా కామెంట్స్ చేస్తోంది.

కాంట్రవర్సీల కారణంగా

కాంట్రవర్సీల కారణంగా

15ఏళ్ళ క్రితం సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన మీరా మిథున్ హీరోయిన్ గా అనుకున్నంతగా అయితే క్రేజ్ అందుకోలేదు. కానీ అప్పుడప్పుడు రియాలిటీ షోల ద్వారా క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. ఇక బుల్లితెరపై ఆమె చేసిన కాంట్రవర్సీల కారణంగా జనాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక మొదటి తమిళ్ బిగ్ బాస్ షోలో కూడా ఆమె చేసిన హంగామా అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది.

విజయ్, సూర్యలను టార్గెట్

విజయ్, సూర్యలను టార్గెట్

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ హీరో హీరోయిన్స్ కి నిద్దర లేకుండా చేస్తోంది. ప్రతిరోజు ఎదో ఒక కాంట్రవర్సీతో మిడియలో చర్చనీయాంశంగా మారుతోంది. త్రిష తనకు అవకాశాలు రాకుండా చేసింది అంటూ మొన్నటివరకు ఒక కొత్త కాంట్రవర్సీతో వైరల్ అయిన మీరా ప్రస్తుతం విజయ్, సూర్య లను టార్గెట్ చేసింది. వారి ఫ్యాన్స్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

మీ భార్యలను అలానే తిడతాను

మీ భార్యలను అలానే తిడతాను

సూర్య, విజయ్ అభిమానుల నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఇటీవల ట్విట్టర్ లో స్పందించిన మీరా రీసెంట్ గా మరో వీడియోని పోస్ట్ చేసింది. మీ అభిమానులకు మీరు నేర్పింది ఇదేనా అంటూ మీరు నన్ను తిట్టడం ఆపకపోతే మీ భార్య లను కూడా అదే రేంజ్ లో తిడతానని మీరా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

 చీర, గాజుల సెట్ పంపనివ్వండి

చీర, గాజుల సెట్ పంపనివ్వండి

మీరు నిజంగా ఒక స్టార్ హీరోలోనా? స్టార్ అనే హోదాకు తగ్గట్టు జీవిస్తున్నారా? మీరు ఇలా సోషల్ మీడియా ద్వారా నన్ను కించపరిచేలా తిట్టించడం కరెక్ట్ కాదు. అసలు మీరు మగాళ్లేనా? లేకపోతే నన్ను ఒక చీర, గాజుల సెట్ పంపనివ్వండి అంటూ మీరా మిథున్ విజయ్ సూర్య లపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అలాగే తనను ఇదే విధంగా అవమానిస్తే ఎదో ఒకేరోజు తమిళ్ నాడు సీఎం అయిపోతాను అంటూ. అప్పుడు మీపై తీవ్రమైన చర్యలు తప్పవని కూడా ఈ బ్యూటీ కామెంట్ చేసింది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
మీరా తగ్గేలా కనిపించడం లేదు

మీరా తగ్గేలా కనిపించడం లేదు

రోజురోజుకి మీరా మిథున్ కామెంట్స్ డోస్ పెరుగుతోందని అభిమానులు కూడా ఆమెపై బూతులు వర్షం కురిపిస్తున్నారు. అందుకు మీరా కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. ఇక ఈ వివాదం డోస్ తగ్గాలి అంటే ఎవరో ఒకరు సైలెంట్ అవ్వాల్సిందేనని కోలీవుడ్ మీడియా సలహాలు ఇస్తోంది. కానీ అభిమానులు తగ్గినా మీరా తగ్గేలా కనిపించడం లేదని కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X