twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపేస్తాం అని బెదిరించారు.. పోలీసులు కూడా హ్యాండ్ ఇచ్చారు.. నటి ఆవేదన

    |

    సినీ నటి, మోడల్ మీరా మిథున్‌కి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేసిన ఈమె.. తాజాగా తనకు పోలీసుల సహకారం కూడా అందక పోగా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల వైపే పోలీసులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

    ఎవరీ మీరా మిథున్..

    ఎవరీ మీరా మిథున్..

    ఓ మోడల్‌గా కెరీర్ ఆరంభించిన మీరా మిథున్ నటనపై ఉన్న ఆసక్తితో పలు సినిమాల్లో కూడా నటించింది. వీటిలో 2017 సంవత్సరం శ్రీ గణేష్ దర్శకత్వంలో వచ్చిన 8 తోటక్కల్ మూవీ ఆమెను ప్రేక్షక లోకానికి దగ్గర చేసింది. ఈ చిత్రంలో మీరా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో మీరాకు అవకాశం దక్కింది.

    2016లో మిస్ సౌత్ ఇండియా కిరీటం

    2016లో మిస్ సౌత్ ఇండియా కిరీటం

    2016 సంవత్సరంలో ఓ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో మీరా మిథున్ కి మిస్ సౌత్ ఇండియా కిరీటం వరించింది. దీంతో సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన ఈ భామ.. తనలా రాణించాలని తాపత్రయ పడే యువతుల కోసం తానే స్వయంగా అందాల పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. పైగా ఓ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది కాబట్టి ఆమెకు అందాల పోటీలంటే చాలా ఇష్టమట.

    అందాల పోటీల్లో వివాదాలు

    అందాల పోటీల్లో వివాదాలు

    ఈ మేరకు తమిళ దివా పేరుతో చెన్నైలో జూన్ 4న అందాల పోటీలు నిర్వహించాలని అన్నీ సిదాం చేసింది మీరా మిథున్. కానీ ఊహించని విధంగా ఆ పోటీలు నిర్వహించొద్దని బెదిరింపులు రావడం, పార్టిసిపెంట్స్ కూడా భయపడటంతో ఆ పోటీలు నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీస్ కంప్లైంట్ చేసింది మీరా.

    భద్రత కల్పిస్తామని పోలీసుల హామీ

    భద్రత కల్పిస్తామని పోలీసుల హామీ

    అందాల పోటీలు నిర్వహిస్తే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని మీరా తన ఫిర్యాదులో పేర్కొంది.. దీంతో భద్రత కల్పిస్తామని మీరాకు హామీ ఇచ్చారట పోలీసులు. కానీ తీరా అందాల పోటీలు నిర్వహించే సమయానికి తనకు ఏ పోలీసుల సహకారం లభించలేదని తాజాగా మీడియా ముందుకొచ్చి మీరా మిథున్ ఆవేదన వ్యక్తం చేసింది.

    అదే పోలీసులని వెంట బెట్టుకుని వచ్చి బెదిరించారు

    అదే పోలీసులని వెంట బెట్టుకుని వచ్చి బెదిరించారు

    పోలీసుల హామీతో అందాల పోటీలకు అన్నీ రెడీ చేస్తే.. చివరకు అందరూ హ్యాండ్ ఇచ్చారని పేర్కొంటూ విలపించింది మీరా. పైగా అలంటి పోటీలు నిర్వహించవద్దని అదే పోలీసులని వెంట బెట్టుకుని వచ్చి కొందరు వ్యక్తులు బెదిరించడం సిగ్గుచేటుగా అనిపించిందని మీరా తన అభిప్రాయాన్ని తెలిపింది.

    Read more about: kollywood
    English summary
    Meera Mithun is a model and a beauty pageant titleholder who entered Kollywood through her first film 8 Thottakkal, in 2017, directed by Sri Ganesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X