బిగ్‌బాస్‌ షోను అడ్డుకోవాల్సిందే.. ఆ దర్శకుడు కావాలనే నా నడుముని టచ్ చేశాడు: న‌టి వార్నింగ్

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు ప్రతి భాషలో కూడా పాపులర్ అవుతోంది. కాంట్రవర్సీ లేనిదే ఈ షోను నడిపించలేరు. వివాదాలే టీఆర్పీ పెరగడానికి మంచి బూస్ట్ ఇస్తాయని అందరికి తెలిసిన విషయమే. తెలుగులో వరుసగా నాలుగవ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా మొదలైంది. నాగ్ హోస్టింగ్ తోనే మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. అయితే తమిళ్ లో ఇంకా స్టార్ట్ కాకముందే వివాధాలు మొదలయ్యాయి.

షాక్ ఇచ్చిన హీరోయిన్..

షాక్ ఇచ్చిన హీరోయిన్..

లోక నాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా గత మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక నాలుగు సీజన్ ని కూడా అదే స్థాయిలో స్టార్ట్ చేయాలని రెడీ అవుతున్న సమయంలో కాంట్రవర్సీ బ్యూటీ మీరా మిథున్ సడన్ షాక్ ఇచ్చింది. కమల్ హాసన్ పై కూడా పలు ఆరోపణలు చేస్తూ తప్పకుండా షోను అడ్డుకుంటాను అని కామెంట్ చేస్తోంది.

బిగ్ బాస్ షోపై ఫోకస్

బిగ్ బాస్ షోపై ఫోకస్

ఇటీవల కాలంలో మీరా మిథున్ పేరు తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోలు తనపై కుట్రలు పన్నుతున్నారని త్రిష కోలీవుడ్ మాఫియాతో కలిసి అవకాశాలు రాకుండా చేస్తోందని అప్పట్లో మీరా పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బిగ్ బాస్ షోపై ఫోకస్ పెట్టింది.

ఆ దర్శకుడు నడుమును తాకాడని..

ఆ దర్శకుడు నడుమును తాకాడని..

బిగ్ బాస్ మూడవ సీజన్ లో మీరా మిథున్ ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడే ఈ బ్యూటీకి కొంత క్రేజ్ దక్కిందనే చెప్పాలి. హౌజ్ లో ఆమె చేసిన రచ్చ వల్ల బుల్లితెరపై కూడా సెన్సార్ రావాల్సిందే అనేంతలా ప్రవర్తించింది. ఇక హౌజ్ లో కంటెస్టెంట్ గా ఉన్న మరో దర్శకుడు చేరన్ తన నడుమును కావాలని తాకాడని నానా గోల చేసింది.

సాక్ష్యం మీరా కోపం తగ్గలేదు

సాక్ష్యం మీరా కోపం తగ్గలేదు

ఆ వివాదం అప్పట్లో కోలీవుడ్ మీడియాలో కూడా స్పెషల్ హెడ్ లైన్స్ కి దారి తీసింది. ఇక కమల్ హాసన్ కి పిర్యాదు చేయగా చేరన్ తప్పేమీ లేదని అలా వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. సాక్ష్యం చూపించినా కూడా మీరా కోపం తగ్గలేదు. వీడియో మార్ఫింగ్ చేసి మోసం చేశారని అందుకు కమల్ హాసన్ కుట్ర పన్నినట్లు మీరా అప్పుడే ఆరోపణలు చేసింది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
లేకపోతే బిగ్ బాస్ ను అడ్డుకుంటాం..

లేకపోతే బిగ్ బాస్ ను అడ్డుకుంటాం..

ఇక ఇప్పుడు తనకు ఆ రోజు అన్యాయం జరిగినందుకు అసలైన వీడియోను బయటపెట్టే వరకు బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ చేయడానికి వీలు లేదని మీరా మిథున్ హెచ్చరించారు. కమల్ హాసన్ కావాలని తన కెరీర్ ని దెబ్బ తీసేందుకు ప్రవర్తించారు కాబట్టి ఆయన కూడా వివరణ ఇవ్వాలని లేకపోతే బిగ్ బాస్ ను అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళతానని మీరా వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X