మీ పెళ్లాలను కూడా ఇలానే చూస్తారా? నాకేదైనా జరిగితే మీరే భాద్యులు.. విజయ్, సూర్యలపై హీరోయిన్ ఫైర్

కోలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. అయితే కరోనా కేసుల కంటే కూడా అక్కడ ఒక హీరోయిన్ కి సంబంధించిన వివధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ట్వీట్స్ ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమె అగ్ర తారాలపై అలాగే ఇతర హీరోయిన్స్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇక రీసెంట్ అమ్మడు స్టార్ హీరోలపై కూడా కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ.. ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అయ్యేలా చేసుకుంటోంది.

హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేడు గాని..

హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేడు గాని..

ఆ బ్యూటీ మరెవరో కాదు. గత కొన్నిరోజులుగా త్రిషను స్పెషల్ గా టార్గెట్ చేస్తున్న మీరా మిథున్. 15ఏళ్ళ క్రితమే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన మీరా, హీరోయిన్ గా అనుకున్నంతగా క్రేజ్ అందుకోలేదు. కానీ పలు రియాలిటీ షోలలో ఆమె చేసిన కాంట్రవర్సీల కారణంగా జనాల దృష్టి ఆమె వైపు మళ్లింది. ఇక మొదటి తమిళ్ బిగ్ బాస్ షోలో కూడా ఆమె చేసిన హంగామా అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది.

కోలీవుడ్ మాఫియాతో కలిసి

కోలీవుడ్ మాఫియాతో కలిసి

ఇక ఇప్పుడు త్రిష, ఐశ్వర్య రాజేష్ వంటి స్టార్ హీరోయిన్స్ పై అమ్మడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. తన స్టైల్ ని కాపీ కోరుతున్నారని ఆరోపించింది. ఇక త్రిష కోలీవుడ్ మాఫియాతో కలిసి తనకి వచ్చిన అవకాశాలను కూడా లాగేసుకుంటోంది అంటూ గత ఏడాది రజినీకాంత్ తో వచ్చిన సినిమా కూడా దక్కకుండా చేసిందని మీరా మిథున్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

హీరో సూర్యలపై కాంట్రవర్సీ కామెంట్స్

హీరో సూర్యలపై కాంట్రవర్సీ కామెంట్స్

ఇక లేటెస్ట్ గా మీరా.. కోలీవుడ్ స్టార్ హీరోస్ విజయ్, సూర్యలపై ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేసింది. మీ అభిమానులు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు అంటూ అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా మీరా వివరణ ఇచ్చింది.

ఏదైనా అయితే మీరే భాద్యులు

ఏదైనా అయితే మీరే భాద్యులు

సోషల్ మీడియాలో ఆమె పలు స్క్రీన్ షాట్స్ ని కూడా షేర్ చేసుకుంది. డైరెక్ట్ గా తన ఫోన్ కి కూడా మెస్సేజెస్, కాల్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ గ్రూపులలో తన నెంబర్ కూడా షేర్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక తనకు ఏమైనా అయితే అందుకు పూర్తిగా మీరే భాద్యులు అవుతారని సూర్య, విజయ్ లను ట్విట్టట్ లో ట్యాగ్ చేసింది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
మీ పెళ్ళాం పిల్లలని కూడా ఇలానే ట్రీట్ చేస్తారా

మీ పెళ్ళాం పిల్లలని కూడా ఇలానే ట్రీట్ చేస్తారా

ఇక ఇంతమంది అభిమానులు ఒక్కసారిగా తనపై అసభ్యకరంగా మాటలతో దాడి చేస్తుంటే ఈ హీరోలు నోరు మెదపడం లేదని చెబుతూ.. ఇంట్లో మీ పెళ్ళాం పిల్లలని కూడా ఇలానే ట్రీట్ చేస్తారా అని మీరా ఘాటుగా స్పందించింది. ఆమె ఈ విధంగా మరోసారి ట్వీట్స్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ మరింత వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X