twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను రేప్ చేస్తామని మీ ఫ్యాన్స్ మెసేజ్‌లు.. మీ భార్యలకు అలాంటివి వస్తే.. విజయ్, సూర్యపై మీరా ఫైర్

    |

    కోలీవుడ్‌ ప్రముఖులపై అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మీరా మిథున్ తాజాగా తమిళ సూపర్‌స్టార్లు విజయ్, సూర్యపై విరుచుకుపడ్డారు. తనపై ఇద్దరి స్టార్ల ఫ్యాన్స్ దారుణంగా వ్యవహరిస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా మెసేజ్, వార్నింగులు పంపుతూ, తనను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ట్వీట్ చేసింది. తనకు వచ్చిన వాట్సప్ ఛాటింగ్ మెసేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సూర్య, విజయ్‌పై మండిపడుతూ..

    సూర్యకు యాక్టింగ్ నేర్పించండి

    సూర్యకు యాక్టింగ్ నేర్పించండి

    త్రిష, ఐశ్వర్యా రాజేష్ లాంటి వారిని టార్గెట్ చేస్తూ నెపోటిజం అంటూ వ్యాఖ్యలు చేసింది. హీరో సూర్య తండ్రి శివకుమార్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసి.. కనీసం మీ కొడుకు (సూర్య)కు యాక్టింగ్ నేర్పించండి అంటూ కామెంట్ చేసింది. అలాగే విజయ్‌ను ఉద్దేశించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో మీరా మిథున్‌ను ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్లు చేయడం వివాదాస్పదంగా మారింది.

    నా ప్రాణాలకు ఏదైనా ముప్పు కలిగితే

    నా ప్రాణాలకు ఏదైనా ముప్పు కలిగితే

    హీరో సూర్యకు నేను చెప్పేది ఏమిటంటే.. ఒకవేళ తనకు గానీ, తన ప్రాణాలకు గానీ ఏమైనా జరగకూడనిది జరిగితే మీరే అందుకు బాధ్యతగా వహించాలి. మీ ఫ్యాన్స్‌ నాకు పంపుతున్న మెసేజ్‌లు చూడండి. నా ఫోన్ నెంబర్లను ఫ్యాన్స్ గ్రూపులో షేర్ చేస్తూ నన్ను వేధిస్తున్నారు అని మీరా మిథున్ తన ట్వీట్‌లో తెలిపారు.

    నీ భార్యకు, పిల్లలకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే

    నీ భార్యకు, పిల్లలకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే

    సూర్య, విజయ్ ఫ్యాన్స్ నాకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపుతున్నారు. నా చంపుతామని,రేప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దాదాపు 80కి పైగా నంబర్ల నుంచి నాకు మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు దీనిని సమర్ధిస్తారా? అదే మీకు గానీ, మీ భార్యలకు గానీ, మీ పిల్లలకు గానీ ఇలాంటి హెచ్చరికలు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోగలరా అని మీరా మిథన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

     చిన్మయి, ధన్యపై ఫైర్

    చిన్మయి, ధన్యపై ఫైర్

    ఇక విజయ్, సూర్య తర్వాత చిన్మయి శ్రీపాద, ధన్య రాజేంద్రన్‌పై కూడా మండిపడ్డారు. కోలీవుడ్ మాఫియాలో వారిద్దరూ భాగస్వామ్యులే. నా జీవితానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా విజయ్, సూర్యతోపాటు అందరూ బాధ్యత వహించాల్సిందే. మీ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది అంటూ ట్వీట్ చేశారు.

    నన్ను రేప్ చేస్తామంటున్నారు..

    నన్ను రేప్ చేస్తామంటున్నారు..

    తనను దూషిస్తూ వచ్చిన వాట్సాప్ మెసేజ్‌ను ట్వీట్ చేస్తూ.. సూర్య, విజయ్.. నిన్నటి నుంచి నాకు ఇలాంటి మెసేజ్ కాల్స్ వస్తున్నాయి. నన్ను రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, జ్యోతిక, సంగీతకు వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇలాంటి మెసేజ్ 80 ఫోన్ నంబర్ల కంటే ఎక్కువగా వస్తున్నాయి అంటూ ట్వీట్ చేసింది.

    Recommended Video

    Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
    మీరా మిథున్ కెరీర్

    మీరా మిథున్ కెరీర్

    మీరా మిథున్ కెరీర్ విషయానికి వస్తే.. 2015లో థ్రిల్లర్, ఎన్నై అరిందాల్ అనే సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రాల్లో అజిత్, అరుణ్ విజయ్, అనుష్క, త్రిషా, పార్వతి నాయర్ లాంటి సహ నటులతో నటించింది. 2019లో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా పాపులారిటీని సంపాదించుకొన్నారు. ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Kollywood actor, bigg boss fame Meera Mitun comments on Tamil Super Stars Suriya, Vijay. She tweeted that, Suriya_offl actorvijay right from yest abusive messages,calls,rape threats n death threats,suppose if the same happens to ur wife,kids will yu accept this #jyothika #sangeetha chennaipolice_ NCWIndia Udhaystalin Still am recieving messages from more than 80different nos!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X