త్రిషపైనే కాదు.. రజనీకాంత్, విజయ్‌పై దారుణమైన కామెంట్స్.. యువ హీరోయిన్ నోటి దురుసు

తమిళ యువ హీరోయిన్, బిగ్‌బాస్ ఫేమ్ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాను ఆకర్షిస్తున్నది. కొద్ది రోజుల క్రితం త్రిషా కృష్ణన్‌పై నోరు పారేసుకొన్న మీరా మిథున్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్, ఇళయ దళపతి విజయ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ ప్రాంతం పేరుతో, విజయ్‌ని మతం పేరుతో విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. మీరా మిథున్ హద్దు మీరి చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు

ఇటీవల త్రిషాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరా మిథున్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనను అనుకరిస్తున్నారంటూ త్రిషపై మండిపడిన ఈ కుర్ర హీరోయిన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సీనియర్ హీరోయిన్ త్రిష ఈమెను అనుకరించడం ఏమిటి? అని మీరా మిథున్ వ్యవహారంపై ముక్కున వేలేసుకొన్నారు.

ఏకంగా రజనీకాంత్, విజయ్‌నే టార్గెట్‌గా

ఏకంగా రజనీకాంత్, విజయ్‌నే టార్గెట్‌గా

ఇక అంతటితో నోటికి తాళం వేసుకొంటుందని భావించిన నెటిజన్లకు మీరా మిథున్ మరోసారి షాకిచ్చారు. ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ హీరో విజయ్‌ని టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్ చేశారు. మతాన్ని, ప్రాంతాన్ని టార్గ్ చేసుకొని విమర్శలు గుప్పించడం దక్షిణాది మీడియాలో చర్చనీయాంశమైంది.

రజనీకాంత్ కన్నడీ.. విజయ్ క్రిస్టియన్ అంటూ

రజనీకాంత్ కన్నడీ.. విజయ్ క్రిస్టియన్ అంటూ

తమిళనాడు దారుణమైన పరిస్థితుల్లో నరకయాతన అనుభవిస్తున్నది. నా మటకు నేను విలాసవంతంగా జీవితాన్ని అనుభవిస్తున్నాను. కన్నడకు చెందిన రజనీకాంత్, క్రిస్టియన్ మతానికి చెందిన హీరో విజయ్ మాత్రం నన్ను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను సోషల్ మీడియాలో వేధిస్తున్నందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాను. పై నుంచి దేవుడు అంతా చూస్తున్నాడు అంటూ మీరా ట్వీట్ చేశారు.

తమిళ పరిశ్రమపై భగ్గు మంటూ

తమిళ పరిశ్రమపై భగ్గు మంటూ

తమిళ చిత్ర పరిశ్రమ నన్ను బహిష్కరించింది. అందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్పుకొంటాను. ఎందుకంటే వారు అలా చేయడం వల్లే నేను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ మోడల్ అయ్యాను. కోలీవుడ్ పట్టించుకోకపోతే ఏంటి? బాలీవుడ్, హాలీవుడ్ నన్ను ఆదరించింది అని ఓ ట్వీట్‌లో మీరా మిథున్ తన పైత్యాన్ని ప్రదర్శించారు.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
మలయాళీలు, క్రిస్టియన్లు డామినేషనా?

మలయాళీలు, క్రిస్టియన్లు డామినేషనా?

తమిళనాడు అంటే తమిళులు, హిందువులు అనుకొంటాం. కానీ మలయాళీలు, క్రిస్టియన్లు డామినేట్ చేస్తున్నారు. తమిళ మహిళగా నాకు ఎంతో అన్యాయం జరుగుతున్నది. ఎందుకు వీళ్లంతా నన్ను చూసి కుళ్లుకొంటున్నారు. నన్న ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కాదు అని మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హీరోల ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X