నయనతార పీకల్లోతు అఫైర్, డేటింగ్.. ధనుష్‌కు ముచ్చెమటలు పట్టించిన హీరో ఎవరో తెలుసా?
తన తండ్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన ఈ స్టార్ హీరో మాస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. తమిళ చిత్ర పరిశ్రమంలో ప్రముఖ హీరోగా పేరు ఉన్నప్పటికీ తరచుగా డేటింగ్ రూమర్స్, వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కాగా ఈ స్టార్ హీరో ప్రస్తుతం కమల్ హాసన్ తో కలిసి పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికీ ఆ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టకపోతే పదండి అసలు విషయంలోకి వెళ్దాం.
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న స్టార్ హీరో పేరు శింబు. ఈ తమిళ హీరో తన తండ్రి టి రాజేంద్రన్ రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ మూవీ కాదల్ అళివాతిల్లై అనే సినిమాలో హీరోగా నటించిన సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ తరచుగా వివాదాలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

సక్సెస్ ఫుల్ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ హీరో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే అతను నయనతారతో ప్రేమలో మునిగి తేలుతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో వీళ్ళిద్దరూ ఎక్కువగా కలిసి కనిపించడం, ఆమె కోసం శింబు ఏకంగా ఒక పాటను రాయడంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నయన్, శింబు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత త్రిష, హన్సిక వంటి హీరోయిన్లతో అతను డేటింగ్ చేస్తున్నాడని ఎన్నో రూమర్లు వచ్చాయి. వాళ్ళు కేవలం తన స్నేహితులు అంటూ శింబు ఆ వార్తలను కొట్టి పడేశాడు. ఇక శింబు రొమాంటిక్ లైఫ్ ఇలా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ లోనూ వివాదాలు తప్పలేదు.

మంచి పాపులారిటీ ఉన్న స్టార్ హీరో ధనుష్ తో శింబుకు శత్రుత్వం అనే వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. నిజానికి శింబు, ధనుష్ ఒకేసారి తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి పంథాలో వాళ్ళు సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా ఎదిగారు. మన్మధన్ అనే సినిమా చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి గురించి వచ్చిన వార్తలు 2012 వరకు కొనసాగాయి.
ఓ ఇంటర్వ్యూలో ధనుష్ తనకు స్నేహితుడు కాదని శింబు చెప్పడంతో ఆ వార్తలకు మరింతగా ఆజ్యం పోసినట్టుగా అయింది. ఆ తర్వాత దుబాయ్ లో జరిగిన ఒక అవార్డుల వేడుకలో వారిద్దరూ కలిసి కనిపించడం, ధనుష్ పుట్టిన రోజును కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

ఆ తర్వాత ధనుష్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని అపార్థాలు ఇద్దరి మధ్య ఉన్నాయన్న విషయాన్ని బయట పెట్టాడు. ప్రస్తుతం శింబు కమల్ హాసన్ తో కలిసి థగ్ లైఫ్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











