కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలో మెగా హీరో.. ఆ స్పెషల్ పాత్ర కోసం బిగ్ ప్లాన్

ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటే చాలా అరుదుగా వచ్చేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం గ్యాప్ లేకుండా బిగ్ మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. కథ నచ్చితే కొందరు స్టార్ హీరోలు నెగిటివ్ షేడ్ లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో తమిళ హీరోలు టాలీవుడ్ హీరోలు కలిసి వర్క్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ మరో ప్రాజెక్ట్ పై పడింది.

తమిళ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ అనంతరం దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న సినిమా కావడంతో అటు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన గాసిప్ వైరల్ అవుతోంది. లియో సినిమాను లోకేష్ యూనివర్స్ కాన్సెప్ట్ లోనే తెరపైకి తీసుకు వస్తున్నాడు.

Mega powerstar ram charan special role in leo latest news viral

ఇక రోలెక్స్ క్యారెక్టర్ తో పాటు విక్రమ్ రోల్ కూడా ఉంటుందని అంటున్నారు. అలాగే మరొక కొత్త క్యారెక్టర్ కూడా చేరుతుందని ఇప్పుడు మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లియో సినిమాలో పవర్ఫుల్ రోల్ చేయబోతున్నట్టు అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో రామ్ చరణ్ తో లోకేష్ అయితే చర్చలు జరిపారు.

Mega powerstar ram charan special role in leo latest news viral

ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉండవచ్చని కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా లియో సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని టాక్ మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక లియో సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీ కానున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రావచ్చు లేదా సమ్మర్ కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X