Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ సినిమాలో కలరింగ్ అదుర్స్.. ఇద్దరు హాట్ హీరోయిన్లతో రొమాన్స్!
2013లో అత్తారింటికి దారేది చిత్రం విడుదలయింది. నేటితో ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఐదేళ్లు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. పవన్ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ విజయం సాధించింది. ఐదేళ్ల తరువాత ఈ చిత్రాన్నీ తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ హీరో శింబు రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. అత్తారింటికి దారేది రీమేక్ అత్యంత ఆసక్తిగా మారింది.
శింబుపై కేసు నమోదు.. రూ.20 కోట్లు ఇప్పించాలని డిమాండ్
సుందర్ సి దర్శత్వంలో
ప్రముఖ నటి ఖుష్బూ భర్త సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీమేక్ హక్కులు భారీ ధరకు దక్కించుకున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్ర తొలి షెడ్యూల్ జార్జియాలో పూర్తయిన సంగతి తెలిసిందే.
శింబుకి జోడిగా
ఈ చిత్రాన్ని మరింత క్రేజీగా మార్చాలని దర్శకుడు సుందర్ భావిస్తున్నారు. అందుకోసం నటీనటుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. శింబు సరసన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ చిత్రంలో రెండవ హీరోయిన్ పాత్ర కూడా ఉంది. అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లు గా నటించారు.
రెండవ హీరోయిన్ ఎవరంటే
సమంత పాత్రకు మేఘా ఆకాష్ ని ఎంపిక చేసుకున్నారు. ఇక ప్రణీత పాత్రలో హాట్ బ్యూటీ కేథరిన్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు వంటి చిత్రాలతో కేథరిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి ఇద్దరు హాట్ బ్యూటీలతో అత్తారింటికి దారేది రీమేక్ మంచి కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో కూడా
ఏ చిత్ర కొత్త షెడ్యూల్ ని చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలలో ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇక అత్త పాత్రలో ఖుష్బూ పేరు వినిపిస్తుండగా చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.