TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నితిన్ హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో!

అదృష్టం కలసి రాలేదు కానీ.. లేకుంటే ఈ పాటికి మేఘా ఆకాష్ సౌత్ లో స్టార్ హీరోయిన్ అయ్యేది. మెగా ఆకాష్ తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు కూడా నితిన్ సరసనే. లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల్లో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. మేఘా నటనకు, గ్లామర్ కు మంచి మార్కులే పడ్డా రెండు చిత్రాలు నిరాశ పరచడంతో ఆ తరువాత అవకాశాలు దక్కలేదు. తమిళంలో మాత్రం కొన్ని అవకాశాలు అందుకుంటోంది. తాజాగా మేఘా ఆకాష్ జాక్ పాక్ లాంటి ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
బ్లాక్ బస్టర్ మూవీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం అత్తారింటికి దారేది. 2013 లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. యువతకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ చిత్రం విపరీతంగా నచ్చేసింది.
పరభాషల్లో
ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం పరభాషల్లో మంచి డిమాండ్ నెలకొని ఉంది. ఇటీవలే తమిళ రీమేక్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులు దక్కించుకుంది.
శింబు హీరోగా
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించబోతున్నారు. శింబు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ నెలలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం నటించే హీరోయిన్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.
నితిన్ హీరోయిన్
యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోందట. ఆమె ఎంపిక దాదాపుగా ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ సరసన మేఘా ఆకాష్ లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. ఆ పాత్ర కోసం ఇప్పుడు మేఘా ఆకాష్ ని ఎంపిక చేసుకుంటున్నారు.
అత్తగా ఎవరు
అత్తారింటికి దారేది చిత్రంలో అత్త పాత్ర చాలా కీలకం. తెలుగులో నదియా నటించారు. తమిళ రీమేక్ లో ఖుష్బూ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర దర్శకుడు సుందర్ సి సతీమణే ఖుష్బూ.