సిగ్గులేదా అన్నందుకు హీరో విశాల్‌కు షాక్.. ముదిరిన మెర్సల్ వివాదం..

By Rajababu

Recommended Video

"మెర్సల్" కొత్త వివాదం.. సిగ్గు లేదా? అంటూ హీరో విశాల్ ఫైర్..

తమిళ ఇలయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రానికి మద్దతు ప్రకటించిన హరో విశాల్‌పై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు కొరడా ఝళిపించాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజాపై విమర్శలు చేసి కొన్ని గంటలు గడవకముందే విశాల్‌కు భారీ షాక్‌ తగిలింది. బీజేపీ నేతపై విమర్శలు చేసిన నేపథ్యంలో విశాల్ ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం గమనార్హం.

 ముదురుతున్న మెర్సల్ వివాదం

ముదురుతున్న మెర్సల్ వివాదం

అక్టోబర్ 19న విడుదలైన మెర్సల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మెర్సల్‌ చిత్ర యూనిట్‌కు ప్రతిపక్షాలు దన్నుగా నిలిచాయి.

 మెర్సల్‌కు అండగా..

మెర్సల్‌కు అండగా..

కమల్‌హాసన్‌, రజనీకాంత్, రాహుల్ గాంధీ, చిదంబరం లాంటి ప్రముఖులు మెర్సల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్‌ కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడి చేయడం సంచలనంగా మారింది. మెర్సల్‌కు అండగా నిలబడిన మిగతావారిపైనా దాడులు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

 విశాల్ ఆఫీసులో జీఎస్టీ సోదాలు

విశాల్ ఆఫీసులో జీఎస్టీ సోదాలు

వార్త సంస్థల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం విశాల్‌ కార్యాలయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వడాపళనిలోని విశాల్‌ కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయన చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన చెల్లింపు వివరాలను తనిఖీ చేశారు. బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసినట్టు సినీ ప్రముఖుడు అజయ్ షణ్ముగం ట్వీట్ చేశారు.

 విశాల్ అకౌంట్ల తనిఖీ

విశాల్ అకౌంట్ల తనిఖీ

వస్తు, సేవా పన్ను చెల్లింపుల్లో విశాల్ ఎగవేతకు పాల్పడ్డారా అనే కోణంలో అధికారులు సోదాలు చేశారు. సినిమా లెక్కలకు సంబంధించిన అకౌంట్లను నిశితంగా పరిశీలించినట్టు తెలిసిందే. జీఎస్టీ పన్ను చెల్లింపు కోసం ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని కేంద్ర ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 బీజేపీ నేతపై విమర్శ

బీజేపీ నేతపై విమర్శ

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీపై డైలాగులతో ధ్వజమెత్తిన మెర్సల్‌ సినిమా పైరసీ కాపీని చూశానని ప్రకటించిన హెచ్‌ రాజాపై విశాల్ తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ పైరసీని ప్రోత్సహించిన ఆయన క్షమాపణ చెప్పాలని విశాల్‌ డిమాండ్‌ చేశారు. పైరసీ సినిమా చూడటానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే విశాల్ కార్యాలయంపై దాడి జరిగినట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X