మరో వివాదంలో విజయ్.. మెజీషియన్‌కే చెవిలో పువ్వు.. చాటింగ్‌తో సహా ఆధారాలు!
Recommended Video

ఇళయ దళపతి విజయ్ సక్సెన్, వివాదాలని ఒకేసారి చూస్తున్నాడు. సర్కార్, మెర్సల్ చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అదేసమయంలో ఈ రెండు చిత్రాలు తీవ్రమైన వివాదాలు కూడా సృష్టించాయి. మెర్సల్ చిత్రం జాతీయ వ్యాప్తంగా వివాదాలతో సంచలనం సృష్టించింది. ఇక సర్కార్ చిత్ర విషయంలో తమిళనాడులో విధ్వంసం జరిగింది. ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో విజయ్ చుట్టూ మరో రచ్చ మొదలైంది. ఈ వివాదానికి మెర్సల్ చిత్రానికి సంబందించినది.

కేంద్రంపై సెటైర్లు
మెర్సల్ చిత్రంలో దర్శకుడు అట్లీ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు. దీనితో రాష్ట్రస్థాయి నుంచి కేంద్రంవరకు బిజెపి నేతలంతా మెర్సల్ చిత్రంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అన్ని వివాదాల మధ్య కూడా మెర్సల్ చిత్రం విజయ్ కెరీర్ లో తిరుగులేని హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో భారత దేశంలోని వైద్యరంగంలో ఉన్న లోపాలని ఎత్తిచూపారు.

మెజీషియన్ పాత్రలో
మెర్సల్ చిత్రంలో విజయ్ మెజీషియన్ పాత్రలో కనిపిస్తాడు. మ్యాజిక్ కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆ సన్నివేశాల కోసం విజయ్ కెనడాకు చెందిన మెజీషియన్ రామన్ శర్మ వద్ద మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్నాడట. మెజిషియన్ల బాడీ లాంగ్వేజ్ స్టేజిపై ఎలా ఉంటుంది లాంటి మెళుకువల కోసం రామన్ వద్ద విజయ్ ట్రైనింగ్ పొందినట్లు తెలుస్తోంది.

మెజీషియన్‌కే చెవిలో పువ్వు
అంతుచిక్కని మాయాజాలాలతో ఆశ్చర్యపరిచే మెజీషియన్ చెవిలోని మెర్సల్ చిత్రం పువ్వు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం పనిచేసినందుకు రామన్ కొంత పారితోషకంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ చిత్ర యూనిట్ తనకు డబ్బు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని రామన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నాడు.
ఆధారాలు ఉన్నాయి
అత్యంత ప్రతిష్టాత్మకమైన తెనడాల్ స్టూడియో సంస్థ మెర్సల్ చిత్రాన్ని నిర్మించింది. ఆ సంస్థ ప్రతినిధితో తనతో చాట్ చేసిన వివరాలని కూడా రామన్ బయట పెట్టాడు. త్వరలోనే మేనేజర్ తో మాట్లాడి మీ డబ్బు అందేలా చేస్తాను. ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి అంటూ తెనడాల్ స్టూడియో ప్రతినిధి తనతో చాట్ చేశాడని రామన్ ఆరోపిస్తున్నాడు. ఇప్పటికైనా తన డబ్బు తనకు అందేలా చేయాలనీ రామన్ డిమాండ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











