#మీటూ: దర్శకుడి బూతు భాగోతం బయటపెట్టి అమలా పాల్ సంచలనం!
#మీటూ ఉద్యమం నేపథ్యంలో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన అమలా పాల్ చేశారు.
తమిళ దర్శకుడు సుశి గణేశన్ గురించి మీటూ ఉద్యమంలో భాగంగా సంచలన ఆరోపణలు చేశారు. సినిమా సెట్లో అతడి సెక్సువల్ మిస్‌కండక్ట్ చాలా దారుణంగా ఉంటుందని, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడతాడని, డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడతాడని అమలా పాల్ ఆరోపించారు.
సుశి గణేశన్ దర్శకత్వంలో
సుశి గణేశన్ దర్శకత్వంలో అమలా పాల్ ‘తిరుట్టు పాయలే 2' అనే సినిమాలో నటించారు. ఆ సమయంలో అతడి ప్రవర్తన వల్ల చాలా ఇబ్బంది పడ్డట్లు అమలా పాల్ తన మీటూ పోస్టు ద్వారా వెల్లడించారు.

లీనాకు అమలా పాల్ మద్దతు
తమిళ ఇండస్ట్రీకి చెందిన మహిళా దర్శకురాలు లీనా మణిమేకలై మీటూ ఉద్యమంలో భాగంగా దర్శకుడు సుశి గణేశన్ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. లీనా తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అమలా పాల్ స్పష్టం చేశారు.

ఇలాంటి వాళ్లకు తగిన బుద్ది చెప్పాలి
కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు... అన్ని చోట్ల మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి జరుగకుండా ప్రభుత్వం తరుపు నుంచి చర్యలు ఉంటే బావుంటుంది అని అమలా పాల్ అభిప్రాయ పడ్డారు.
అమలా పాల్‌కుసుశి గణేశన్ భార్య మంజరి ఫోన్
కాగా... మీటూ పోస్ట్ పెట్టిన కొంత సేపటి క్రితమే తనకు షాకింగ్ సంఘటన ఎదురైంది. సుశి గణేశన్, అతని భార్య మంజరి నాకు ఫోన్ చేశారు. ఈవిషయంలో నా స్టాండ్ ఏమిటో చెప్పాలని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. మంజరితో నేను మాట్లాడుతుంటే... సుశి గణేశన్ ఇష్టం వచ్చినట్లు నన్నుతిట్టడం మొదలు పెట్టాడు.... అని అమలా పాల్ తెలిపారు.

మీరు నన్ను భయ పెట్టలేరు
మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. మంజరి వెటకారంగా నవ్వుతూ ఇద్దరూ కలిసి నా వ్యక్తిత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చెత్త ఐడియాలతో నన్ను భయపెట్టలేరు అని అమలా పాల్ తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications